Wednesday, 27 October 2021

Peddanna Trailer : ఈ రోజు నుంచి మొదలవుతుంది జాతర.. రజినీ మార్క్ డైలాగ్స్

సూపర్ స్టార్ నుంచి సగటు సినీ ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడో తెలిసిన డైరెక్టర్లు సినిమా తీస్తే ఎలా ఉంటుందో కూడా అలానే ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. పక్కా మాస్ కథతో ఫుల్ యాక్షన్‌తొ రజినీ మెప్పించేందుకు రాబోతోన్నాడు. ఇక డైలాగ్స్‌లో వింటేజ్ రజినీ గుర్తుకు వస్తుంటాడు. కథ మాత్రం అదే మూసధోరణిలో వెళ్లినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రజినీ కొట్టిన డైలాగ్స్.. ‘నువ్ ఎవరన్నది.. నువ్ వెనకేసున్న ఆస్తిలోనో, నీ చుట్టూ ఉన్న మనిషుల్లోనూ లేదు..నువ్ చేసే చర్యల్లోనూ మాట్లాడే మాటల్లోనూ ఉంటుంది.. ఇది వేదవాక్కు’, ‘న్యాయంగానూ ధైర్యంగానూ ఓ ఆడపిల్ల ఉంటే.. ఆ దేవుడి దిగి వచ్చి తనకు తోడుగా ఉంటాడు’, ‘ఈ రోజు నుంచి మొదలవుతుంది జాతర.. మిఠాయి కిల్లీ’ అద్భుతంగా ఉన్నాయి. ఇక రౌడీగా జగపతి బాబు మళ్లీ భయపెట్టేందుకు వస్తున్నాడు. జీవితంలో శత్రువులను ఎంతో మందిని చూశాను.. మొట్టమొదటి సారిగా నా చేత కన్నీళ్లు చిందించిన శత్రువువి నువ్. నిన్ను అంతం చేయడం బాధ్యత కాదు.. నా హక్కు అంటూ జగపతి బాబు అదిరిపోయే లుక్కులో కనిపించాడు. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్‌ను ఎలివేట్ చేసేలా ఉంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 4న దీపావళి కానుకగా పెద్దన్న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ అన్నాత్తె డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XOCJcg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...