Friday, 8 October 2021

Kondapolam: ‘కొండ‌పొలం’ బిజినెస్ ఎంత జ‌రిగింది.. హిట్ కావాలంటే రావాల్సిందెంత?

‘ఉప్పె’తో బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్‌. ఈ మూవీ త‌ర్వాత ‘కొండ‌పొలం’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి ఈ సినిమా హిట్ కావాలంటే ఎంత కెల‌క్ష‌న్స్ సాధించాలో తెలుసా? అనే వివ‌రాల్లోకెళ్తే.. ‘కొండ‌పొలం’ చిత్రం విడుదలకు ముందు నైజాం ఏరియాలో రూ.2.5 కోట్లు, సీడెడ్‌లో రూ.1.3 కోట్లు, ఆంధ్ర‌లో రూ.3కోట్లు బిజినెస్ జ‌రిగింది. అంటే రెండు రాష్ట్రాల్లో రూ.6.8 కోట్లు వ్యాపారం జ‌రుపుకోగా, మిగిలిన చోట్ల రూ.70ల‌క్ష‌లు బిజినెస్ జ‌రుపుకుంది. అంటే మొత్తంగా రూ.7.5కోట్లు వ్యాపారం జ‌రుపుకుంది. అంటే కొండ‌పొలం మూవీ హిట్ టాక్ తెచ్చుకోవాలంటే రూ.7.5 కోట్లు వ‌సూళ్లు చేయాలి. నిజానికి వైష్ణ‌వ్ తేజ్ తొలి చిత్రం రూ.85 కోట్లు వ‌సూళ్ల‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో వైష్ణ‌వ్ తేజ్ రెండో మూవీ ‘కొండ‌పొలం’ బిజినెస్ కూడా భారీగానే చేసుకుంటారు అని అందరూ అనుకున్నారు. అయితే ద‌ర్శ‌క నిర్మాత అయిన క్రిష్ జాగ‌ర్ల‌మూడి బిజినెస్ విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాడు. అందుక‌నే సినిమా బ‌డ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూ.7.5 కోట్ల రూపాయ‌ల‌కే సినిమాను అమ్మాడు. మ‌రి కోవిడ్ నేప‌థ్యంలో కొండ‌పొలం మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధిస్తుందేమో చూడాలి. స‌న్న‌పురెడ్డి వెంటకరామిరెడ్డి రచించిన న‌వ‌ల ఆధారంగా క్రిష్ జాగ‌ర్ల‌మూడి ‘కొండ‌పొలం’ సినిమాను తెర‌కెక్కించాడు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. ఇంజ‌నీరింగ్ చ‌దివిన ఓ యువ‌కుడు ఉద్యోగం సంపాదించుకోవ‌డానికి భ‌య‌ప‌డుతుంటాడు. అలాంటి యువ‌కుడు కొండ‌పొలంకు వెళ్లిన‌ప్పుడు మాన‌సికంగా ఎలాంటి ప‌రిణితి చెందాడ‌నేదే క‌థ‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oJCH0g
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...