Sunday, 24 October 2021

పెళ్లి సందD హీరోయిన్‌కి క్రేజీ ఆఫర్.. మెగా హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్!

తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని లాగేయడం నటీనటులకు అంత సులువైన పనేం కాదు. నటన, లుక్స్ పరంగా ఎంతో ఆకట్టుకుంటే తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదు. అయితే ఆ విషయంలో పెళ్లి సందD హీరోయిన్‌ సక్సెస్ అయింది. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ జాబితాలో ఆమె చేరిపోయింది. రాఘవేంద్రుడి దర్శకత్వ పర్యవేక్షణలో తనదైన అభినయం, అందచందాలతో అట్రాక్ట్ చేసింది. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందD సినిమాలో శ్రీ లీల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. వెండితెరపై శ్రీ లీల అందాలకు యువత ఫిదా అవుతోంది. మరోవైపు దర్శకనిర్మాతలు సైతం ఈ కొత్త అందానికి ముగ్దులయ్యారు. దీంతో అమ్మడికి ఆదిలోనే బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి. అందంతో పాటు అంతకు మించిన చలాకీతనం ఉన్న శ్రీ లీలను హీరోయిన్‌గా తీసుకోవడానికి చాలామంది దర్శకనిర్మాతలు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టబోతోందని, ఓ మెగా హీరోతో శ్రీ లీలకు రొమాన్స్ చేసే అవకాశం వచ్చిందని ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం మాస్ రాజా రవితేజ త్రినాధ రావు నక్కిన కాంబినేషన్‌లో రాబోతున్న ఓ కొత్త సినిమాలో ఆమె నటిస్తోంది. చూడాలి మరి ఏ మెగా హీరో సినిమాలో ఆమె ఛాన్స్ దక్కించుకుందనే దానిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3B7ShFF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...