Sunday, 24 October 2021

గోవాలో మెగా డాటర్ రచ్చ.. బీచ్‌లో అలా కూర్చుని చేతిలో డ్రింక్.. నిహారిక పిక్ వైరల్

మెగా జంట చైతన్యలు ఇప్పుడు గోవాలో హల్చల్ చేస్తున్నారు. తన ఫ్రెండ్ పెళ్లి కోసం నిహారిక వెళ్లినట్టు కనిపిస్తోంది. అయితే కూడా నిహారికతో గోవాకు చెక్కేశాడు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు గోవాలో దుమ్ములేపుతున్నారు. గోవా బీచుట్లో అలా కూర్చుని సేద తీరుతున్నారు. సూర్యాస్తమయంలో బీచ్‌లో అలా కూర్చుని, చుట్టూ ఇసుక తిన్నెలు, చేతిలో కోకోకోలా డ్రింక్ తాగుతుంటే వచ్చే మజానే వేరు అన్నట్టుగా నిహారిక ఓ పోస్ట్ చేసింది. అందులో నిహారిక హాట్ లుక్కులో దర్శనమిచ్చింది. ఫ్రెండ్ పెళ్లి కోసం వెళ్లిన నిహారిక, చైతన్యలు గోవాలో మంచి వెకేషన్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అంతకు ముందు వారం రాజస్థాన్‌కు వెళ్లారు. అక్కడ రణతంబోర్ నేషనల్ పార్కులో చక్కర్లు కొట్టారు. దాని కంటే ముందు అరుకులోయలోని లంబసింగిలో రచ్చ చేశారు. వెబ్ సిరీస్ షూటింగ్‌లో భాగంగా నిహారిక లంబసింగికి వెళ్లింది. నిహారికతో పాటు చైతన్య కూడా అక్కడికి జంప్ అయ్యాడు. అలా ఇప్పుడు నిహారిక, చైతన్యలు గోవాలోఉంటే.. నాగబాబు, వరుణ్ తేజ్‌లు దుబాయ్‌లో షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. నిహారిక తన తాజాగా ఫోటో గురించి, అది తీసిన తన భర్త గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంది. ఈ ఇసుకు, ఈ గాలి, ఈ సముద్రం, ఈ కోకో కోలా.. ఈ ఫోటోలో ప్రతీ ఒక్కటీ నాకు నచ్చింది. థాంక్యూ హబ్స్ అంటూ చైతన్య గురించి చెప్పకనే చెప్పేసింది. ఆ ఫోటోను తీసింది చైతన్యే అని అలా పరోక్షంగా చెప్పేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nh21bC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...