Saturday, 2 October 2021

చైసామ్ విడాకులు.. మధ్యలోకి దూరిన ఆర్జీవీ.. చావు, పుట్టుక అంటూ రచ్చ

ఎప్పుడు ఎలాంటి ట్వీట్లు వేస్తాడు.. మాటలను వదులుతాడు అన్నది ఎవ్వరూ పసిగట్టలేరు. అలాంటి వర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చలోకి దూరాడు. అసలే నాగచైతన్య విడాకుల వ్యవహారంపై అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. తమ అభిమాన తారలు విడిపోయారని ఫీలవుతున్నారు. అలాంటి వారికి వేసిన ట్వీట్, గతంలో చెప్పిన మాటలు చిరాకును తెప్పిస్తున్నాయి. అయితే సమంత నాగచైతన్యల విడాకుల విషయంపై వర్మ అయితే నేరుగా స్పందించలేదు. ఎన్నో చర్చలు తరువాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని సమంత, ప్రకటించారు. విడాకులపై అధికారికంగా ఉమ్మడి ప్రకటన చేశారు. భార్యాభర్తలుగా విడిపోయినా కూడా స్నేహితుల్లా కలిసి ఉంటామని అన్నారు. తమ మధ్య ఉన్న స్నేహబంధం ఎప్పటికీ ఇలానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విడాకుల ఇష్యూతో అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. ఇలాంటి సమయంలో ఆర్జీవీ ఓ ట్వీట్ వేశాడు. పెళ్లి, విడాకులు అనే వాటిని మనం సెలెబ్రేట్ చేసుకోవద్దు.. పెళ్లంటే మంట.. అంటూ ఆర్జీవీ తన స్టైల్లో మాటలను వదిలేశాడు. పెళ్లంటే చావు.. విడాకులు అంటూ మళ్లీ జన్మ రావడం అంటూ చెప్పేశాడు. అంటే సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై ఆర్జీవీ ఇలా పరోక్షంగా స్పందిస్తూ.. విడాకులు మంచివే అన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి సమంత నాగ చైతన్యల విడాకుల వ్యవహారంపై ఇండస్ట్రీ మాత్రం సైలెంట్‌గా ఉంటోంది. ఈ మ్యాటర్‌‌పై కస్తూరీ శంకర్ మాత్రమే స్పందించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a1xZ5w
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...