Saturday, 2 October 2021

అదే ఆశించాను.. గుండె బద్దలైంది!.. చైసామ్ విడాకులపై ‘ఇంటింటి గృహలక్ష్మీ’ నటి సంచలన కామెంట్స్

నాగచైతన్యల విడాకుల వ్యవహారం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇండస్ట్రీలో కొంత మందికి ఈ విషయం ముందే తెలిసినా కూడా అభిమానులకుమాత్రం ఇది షాకింగ్‌గానే అనిపించింది. గత నెల నుంచి మీడియాలో రకరకాల వార్తలు రాగా.. వాటిని అభిమానులు ఖండించారు. సమంత, నాగచైతన్యలు కలిసి ఉంటారని గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. అలాంటి రూమర్లు రాయడంపై అభిమానులు కాస్త హర్ట్ అయ్యారు. కానీ తాజాగా సమంత, నాగచైతన్య చేసిన పోస్ట్‌తో అందరూ షాక్ అవుతున్నారు. భార్యాభర్తలుగా విడిపోతోన్నామని చెబుతూనే.. స్నేహితులుగా ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్పుకొచ్చారు. ఎన్నో చర్చల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే సమంత, నాగ చైతన్యలు కలిసే ఉండాలని ఎంతో మంది అభిమానులు కలిసి ఉండాలని కోరుకున్నారు. అందులో ఇంటింటి గృహలక్ష్మీ నటి కస్తూరి శంకర్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. సమంత నాగచైతన్యలు కలిసే ఉంటారని ఊహించాను ఆశించాను అంటూ పేర్కొంది. హృదయం బద్దలైందన్నట్టుగా హార్ట్ సింబల్ బద్దలైన ఎమోజీని షేర్ చేసింది. నిట్టూర్పులో ఉన్నట్టుగా కస్తూరీ శంకర్ తెగ ఫీలైపోయింది. మొత్తానికి కస్తూరీ శంకర్ చేసిన పోస్ట్ చైసామ్ అభిమానులను కదిలిస్తోంది. అయితే , సమంత విడాకుల వ్యవహారం వెనుక ఉన్న కారణాలు మాత్రం సరిగ్గా తెలియడం లేదు. ఇక భరణంగా సమంతకు మూడు వందల కోట్లు రాబోతోన్నాయంటూ మరో రూమర్ పుట్టుకొస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందనేది సమంత, చైతన్యలకే తెలియాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3otrPUi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...