Sunday, 3 October 2021

బన్ని కోసం డిఫరెంట్ జానర్‌లోకి వెళ్తున్న మురుగదాస్.. మళ్లీ అదే రిపీట్ అవ్వదుగా..?

‘గంగోత్రి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన నటుడు అల్లు అర్జున్. ఆ తర్వాత తన స్టైల్‌తో, నటనతో ఆయన స్టార్ హీరోగా ఎదిగిపోయారు. చేసిన ప్రతి సినిమాలో విలక్షణత చూపిస్తూ.. ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇంతకాలంగా ‘స్టైలిష్ స్టార్’ అనే బిరుదుతో ఉన్న రీసెంట్‌గా ‘ఐకాన్ స్టార్‌’గా మారిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘’ సినిమాతో ఆయన ఐకాన్‌స్టార్‌గా ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’.రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా తొలి భాగం డిసెంబర్‌లో విడుదల అవుతోంది. అయితే ఈ సినిమా తర్వాత కూడా వరుస పాన్‌ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు బన్ని. ఇందులో సెన్సేషనల్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో చేసే సినిమా ఒకటి. ఇప్పటి ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలాకాలమే అయింది. అయితే ‘పుష్ప’ సినిమా షూటింగ్‌లో అల్లు అర్జున్ బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాలేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి సోషల్‌మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాను ‘సైన్స్, ఫిక్షన్’ జానర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారట దర్శకుడు మురుగదాస్. అయితే ఈ వార్త తెలిసిన వెంటనే అల్లు అర్జున్ అభిమానుల మనస్సుల్లో ఓ అనుమానం నెలకొంది. గతంలో మహేష్‌బాబు హీరోగా మురుగదాస్ ‘స్పైడర్’ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను కూడా భారీ అంచనాల నడుమ విడుదల చేశారు. కానీ, అనూహ్యంగా ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్‌తో తీసే సినిమాకు కూడా ఇలాంటి ఫలితమే వస్తుందా ఏంటీ..? అని అభిమానులు భయపడుతున్నారు. అయితే సినిమాపై అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాతే.. ఈ అనుమానాలకు తెరపడే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YeNgxr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...