Monday, 4 October 2021

‘నువ్వు పెట్టుకుంది శివతో’.. భారీ యాక్షన్‌తో గోపిచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ ట్రైలర్

‘’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌లో గోపీచంద్ హీరోగా సినిమా ఒకటి అప్పట్లో రూపొందింది. హీరోయిన్. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు నటించారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వక్కంతం వంశీ కథ అందించారు. సంగీతం సమకూర్చారు. ఇలాంటి టాప్ టెక్నీషియన్లు పనిచేసిన ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోలేదు. తెలుగు సినిమాల్లో దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించే సినిమాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. ఆయన తీసే సినిమాల్లో యాక్షన్.. ఇంకే దర్శకులు చూపించి ఉండరు. అయితే ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ ఆరడుగుల బుల్లెట్‌ సినిమా మాత్రం షూటింగ్ పూర్తి చేసుకొని చాలాకాలమే అయినప్పటికీ.. విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఇందుకు ఆర్థిక ఇబ్బందులు, ఇతర విషయాలు కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అన్ని అడ్డంకులు దాటుకొని.. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమా విడుదల అవుతన్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. తన తండ్రిపై యుద్ధం చేస్తున్న వారితో పోరాడే కొడుకు పాత్రలో ఈ సినిమాలో కనిపించారు. ఇక ఈ ట్రైలర్‌లో రూపొందిన రొమాన్స్, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. మరి ఈ సినిమాతో గోపిచంద్ సూపర్‌హిట్ అందుకుంటారు అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, చలపతిరావు, రమా ప్రభ తదితరులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. అబ్బూరి రవి కథ అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iuB4jj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...