Monday, 4 October 2021

బానిసలా చూస్తే భరించను.. ఆత్మాభిమానం ముఖ్యం : బండ్ల గణేష్‌

ట్విట్టర్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఎవరికి ఎలా కౌంటర్లు ఇవ్వాలన్నా కూడా ట్వీట్లతోనే మాటల తూటాలు పేల్చుతుంటాడు. అలాంటి బండ్లన్న తాజాగా ఓ ట్వీట్ వేశాడు. దాని నిగూఢ అర్థం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.మామూలుగా అయితే బండ్ల గణేష్ ప్రతీ రోజూ ఏదో ఒక కొటేషన్‌ను షేర్ చేస్తూ ఉంటాడు. సూక్తులను షేర్ చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా బండ్ల గణేష్ వేసిన ట్వీట్ ఎన్నో అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ ఆయన వేసిన ట్వీట్ ఏంటో ఓసారి చూద్దాం. ‘నేను ప్రేమిస్తే నన్ను ప్రేమించాలి, నేను పూజిస్తే నన్ను అభిమానించాలి, నన్ను బానిసలా చూస్తే నేను భరించను, లేకపోతే నన్ను ప్రేమించే వాళ్లదగ్గరికి వెళ్లిపోతా, నాకు ఆత్మాభిమానం ముఖ్యం’ అయితే ఇప్పుడు ఈ ట్వీట్ వేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయా? అని నెటిజన్లు జుట్టుపీక్కుంటున్నారు. మా ఎన్నికల విషయంలో మళ్లీ హర్ట్ అయ్యాడా? అందుకే ఇలా వేశాడా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అసలే , జనరల్ సెక్రటరీకి పోటీ, జీవిత రాజశేఖర్ మీద గెలవాలనే కసితో బరిలోకి దూకాడు. కానీ ఆయన దూకుడు స్పీడు బ్రేకులు పడ్డాయి. తనకు ఎంతో ఇష్టమైన వారు, దైవసమానులు చెప్పారనే ఉద్దేశ్యంతోనే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నాను.. నామినేషన్ ఉపసంహరించుకుంటున్నాను అని బండ్ల గణేష్ పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలోనే బండ్ల గణేష్‌ను ఎవరైనా తేలికగా తీసుకున్నారా? దానికి బండ్లన్న హర్ట్ అయి ఇలా ట్వీట్ వేశాడా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3D93sPJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...