Thursday, 28 October 2021

వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ: ఇదీ ఫస్టాఫ్, సెకండాఫ్ రిపోర్ట్

విలక్షణ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న యువ హీరో ఈ సారి '' అనే కుటుంబ కథా చిత్రంలో రంగంలోకి దిగారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ నేడు (అక్టోబర్ 29) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. వ‌రుడు కావలెను చిత్రం ఇంట్రెస్టింగ్ అంశాల‌తో ఆస‌క్తిక‌రంగా సాగిందనే టాక్ వినిపిస్తోంది. కామెడీ, ఎమోష‌న‌ల్ సీన్స్ సినిమాలో హైలైట్ అయ్యాయని అంటున్నారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి మంచి వినోదం పంచే సినిమా ఇది అని అంటున్నారు. ఫస్టాఫ్ పర్లేదు కానీ సెకండాఫ్ మాత్రం కాస్త బోర్ ఫీల్ తెప్పించిందని, మొత్తంగా చెప్పాలంటే యావరేజ్ సినిమా ఇది అని చెబుతున్నారు. కొందరైతే ఈ సినిమా అవుట్ డేటెడ్ అని కామెంట్ చేస్తున్నారు. పాటలు ఫ్రెష్‌గా అనిపిస్తాయని, ప్రొడక్షన్ వ్యాల్యూస్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే కొన్ని సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని అంటున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన యంగ్ హీరోయిన్ రీతూ వర్మ నటించింది. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bkZasH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...