Thursday, 28 October 2021

భార్యతో సరదాగా షికార్లు! పెళ్లి తర్వాత తొలిసారి.. జబర్దస్త్ అవినాష్ పోస్ట్ వైరల్

లాక్ డౌన్ వేళ పలువురు హీరోహీరోయిన్స్ పెళ్లి పీటలెక్కి ఓ ఇంటివాళ్ళు కాగా.. రీసెంట్‌గా జబర్దస్త్ కమెడియన్ బంధంలో అడుగు పెట్టాడు. అక్టోబర్ 20వ తేదీన గ్రాండ్‌గా హైద్రాబాద్‌లో పెళ్లి చేసుకున్నాడు అవినాష్. ఈ పెళ్లి వేడుకలో పలువురు జబర్దస్త్ కమెడియన్లతో పాటు బిగ్ బాస్ కంటిస్టెంట్స్ తెగ సందడి చేశారు. ముఖ్యంగా శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి తర్వాత ఇప్పుడు జోరు మీదున్న తన భార్యతో కలిసి బయటకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. నవ వధూవరులిద్దరూ కారులో సరదాగా షికార్లు కొట్టారని అవినాష్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ద్వారా తెలుస్తోంది. తన భార్యతో కలిసి దిగిన ఓ పిక్‌ని ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న అవినాష్.. పెళ్లి తరువాత భార్యతో మొదటి సెల్ఫీ అంటూ తెగ మురిసిపోతూ ట్యాగ్ లైన్ రాశాడు. ఇది చూసిన నెటిజన్లు ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ 20న అవినాష్ పెళ్లి జరగగా, 24న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తన సొంత ఊరు జగిత్యాలలో జరిగిన ఏ వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు, జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు ఒకే చోట చేరి తెగ సందడి చేశారు. చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, శ్రీముఖిల అల్లరితో పెళ్లింట సందడి వాతావరణం నెలకొంది. మెహెందీ, హల్దీ, పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్నింటా ఫుల్ ఎంజాయ్ చేస్తూ హంగామా చేశారు. ఇలా పెళ్లి పనులన్నీ ముగించుకున్న అవినాష్.. భార్యతో ప్రశాంతంగా ట్రిప్స్ వేస్తున్నాడు. భార్యతో జర్నీ ఎంజాయ్ చేస్తూ ఆయా ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZyyWQJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...