Monday, 4 October 2021

చాలా రోజుల తరువాత ఆ ఫీలింగ్.. గుట్టువిప్పిన నమ్రత

సూపర్ స్టార్ ఫ్యామిలీ నిత్యం వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. మహేష్ బాబు, , గౌతమ్, సితారాలకు ఇష్టమైన ప్రదేశం ఒకటి ఉంది. స్విస్ ఆల్ప్స్ అనే ప్రదేశంలో మహేష్ బాబు ఫ్యామిలీ ఇది వరకే అక్కడ ఎంజాయ్ చేసింది. అయితే కరోనా రావడంతో గత రెండేళ్లుగా అక్కడికి మహేష్ బాబు ఫ్యామిలీ వెళ్లలేదు. అయితే సర్కారు వారి పాట షూటింగ్ నిమిత్తం దుబాయ్, గోవా వంటిప్రదేశాల్లో సందడి చేశారు. ఇక మహేష్ బాబు తన సినిమా షూటింగ్ అవుట్ డోర్‌లో ఉంటే.. తన ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్తాడు. అయితే నమ్రత తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో తన ఇష్టాలను బయటపెట్టేసింది. ఈ సరస్సు ద్వారా స్వచ్చమైన గాలిని పీల్చుతున్నాను. ఎన్నో ఏళ్ల తరువాత శ్వాసిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి ఓ అద్భుతమైన క్షణాలు ఉండటం నాకు నిజంగానే అదృష్ణమని చెప్పుకొచ్చింది. మళ్లీ తిరిగి బతికినట్టు అనిపిస్తోందని, ఈ ప్రపంచంలోకెల్లా నాకు ఇష్టమైన ప్రదేశం స్విస్ ఆల్ఫ్స్ అని చెప్పుకొచ్చింది. ఇక నమ్రత షేర్ చేసిన ఫోటోలో గౌతమ్, సితారలు మాత్రమ కనిపించారు. బహుషా మహేష్ బాబే ఆ ఫోటోను తీసి ఉంటారు. మొత్తానికి మహేష్ బాబు ఫ్యామిలీ మాత్రం విదేశాల్లో ఇలా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ నవంబర్‌లో మొదలయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక అటుపై రాజమౌళితోనూ మహేష్ బాబు ఓ చిత్రం చేసేందుకు సిద్దంగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iv5v96
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...