సినీ ఇండస్ట్రీలో నట వారసులు సందడి చేయడమనేది ఇప్పట్లో సాధారణమైన విషయమే. అయితే స్టార్స్ వారి నట వారసులతో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయాలని అభిమానులు భావిస్తుంటారు. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, మోహన్‌బాబు, వెంకటేశ్.. ఇలా స్టార్స్ అందరూ వారి నట వారసులతో వెండితెరపై సందడి చేసి అభిమానులను అలరించిన వారే. అయితే నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఇంకా సినీ ఎంట్రీ ఇవ్వలేదు. ఈయన ఎంట్రీ కోసం.. ఆయన బాలయ్యతో కలిసి నటించే సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే వెంకటేశ్, రానాతో కలిసి నటించారు కానీ, ఆయన కొడుకు కూడా ఇంకా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టలేదు. ఇలా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో నట వారసుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది పవన్ కళ్యాణ్. ఆయన కొడుకు అకీరా నందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇటు పవర్‌స్టార్, అటు మెగాభిమానులు కోరిక త్వరలోనే తీరబోతుందని నెట్టింట వార్తొకటి తెగ హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీస్ ఒకటైన హరిహర వీరమల్లు చిత్రంలో ఆయన కొడుకు అకీరానందన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. ఇదే కనుక నిజమైతే మాత్రం మెగా, పవర్ అభిమానుల ఆనందానికి తిరుగుండదు. దర్శకుడు క్రిష్ ఓ కీలక పాత్ర కోసం ఎవరైతే బావుంటుందని భావించి, చివరకు చేస్తే బావుంటుందని భావించి పవన్ కళ్యాణ్‌ను అడిగితే ఆయన కూడా ఓకే అన్నట్లు టాక్ చక్కర్లు కొడుతుంది. అయితే కొన్ని నెలలు ముందు రేణూ దేశాయ్ మాత్రం అకీరా నందన్‌కు ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదంది. మరి ఈ వార్తలపై నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే. పవన్ కళ్యాన్ నటిస్తోన్న తొలి పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎ.ఎం.రత్నం నిర్మాత. ఇప్పటికే సినిమా అరవై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. భీమ్లా నాయక్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత పవన్ ..ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెడతారని సమాచారం. మొఘలుల కాలంలో ప్రజలకు అండగా నిలబడ్డ బందిపోటు దొంగ సాయన్న కథాంశమే ఈ చిత్రమని టాక్ వినిపిస్తోంది. కాగా.. ఇందులో మొఘలు చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pEhvcS
v
No comments:
Post a Comment