Tuesday, 26 October 2021

ముందు నాగ చైతన్యకు చెప్పా.. కానీ కుదర్లేదు.. మహిళా డైరెక్టర్ కామెంట్స్ వైరల్

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ ప్రాజెక్టు ఎలా టర్న్ తీసుకుంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ఓ హీరోతో అనుకున్న సినిమా ఊహించని విధంగా మరో హీరో చేతిలో పడటం సాధారణంగా జరిగే పరిణామమే. యంగ్ హీరో హీరోగా రాబోతున్న '' సినిమా విషయంలో కూడా అదే జరిగిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర దర్శకురాలు సినిమా గురించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 'వరుడు కావలెను' సినిమాతో అనే డైరెక్టర్ దర్శకురాలిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. అక్టోబర్ 29న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర విశేషాలు చెప్పిన లక్ష్మీ సౌజన్య.. ముందుగా ఈ సినిమాలో హీరోగా అనుకున్నామని, కానీ కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో నాగ శౌర్యతో కంప్లీట్ చేశామని చెప్పారు. 2017 సంవత్సరంలో ‘వరడు కావలెను’ సినిమా స్టోరీలైన్‌ను నిర్మాత చినబాబుకు చెప్పగా.. ఆయన ఓకే చేయడంతో పూర్తి కథ రెడీ చేసి షూటింగ్ చేద్దామనుకునే లోగా మా నాన్నగారు దూరం కావడం, కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల కాస్త ఆలస్యమైందని లక్ష్మీ సౌజన్య అన్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి ప్రేమించాలంటే ఆ అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలని ఆశపడుతుందో అదే ‘వరుడు కావలెను’ సినిమా అని ఆమె పేర్కొన్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో నాగ శౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, దిగు దిగు దిగు నాగ సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ntbUTU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...