Wednesday, 27 October 2021

కూతురి పెళ్లి విషయంలో అలా ఉండండి! టెన్షన్ పడే బదులు ఆ పని చేయండంటూ సమంత షాకింగ్ పోస్ట్

అక్కినేని ఫ్యామిలీతో కట్ చేసుకున్నా అని చెప్పిన .. ఆ తర్వాత తన జోరు పెంచేసింది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ జనాన్ని మోటివేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కూతుళ్ల పెళ్లి విషయమై తల్లిదండ్రులకు సూచనలిస్తూ తన ఇన్స్‌‌స్టాగ్రామ్ స్టోరీగా ఓ సందేశాన్ని పంచుకుంది సమంత. విడాకుల ప్రకటన అనంతరం సామ్ ఇలా పోస్ట్ చేయడం పలువురి దృష్టిని ఆకర్షించింది. 'మై మామ్‌ సెడ్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఉపయోగిస్తూ ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరిస్తూ వస్తోంది సమంత. ఈ క్రమంలోనే తాజాగా కూతురు పెళ్లి విషయంలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ''మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారాని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆమె పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు మంచి చదువు చదివించి తన కాళ్లపై తాను నిలబడేలా చేయండి. పెళ్లికి సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయడం అంతకంటే ముఖ్యం. అలాగే తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో బ్రతకడం నేర్పించండి. అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి'' అంటూ సందేశమిచ్చింది సమంత. ఇకపోతే రీసెంట్‌గా తన బెస్ట్‌ ఫ్రెండ్‌, మోడల్‌ శిల్పారెడ్డితో ఛార్ ధామ్ యాత్రకు వెళ్లి హిమాలయాల సమీపంలోని పవిత్ర దైవ క్షేత్రాలను చుట్టి వచ్చిన సామ్.. ఇకపై విడాకుల వ్యవహారాన్ని మరిచి ఫోకస్ అంతా సినిమాలపై పెట్టాలని బలంగా ఫిక్సయిందట. ఈ మేరకు బలమైన కథలను వింటోందట. మరికొద్ది రోజుల్లో సమంతకు సంబంధించిన రెండు కొత్త ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు రానున్నాయని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mguMWI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...