Wednesday, 27 October 2021

మరీ అమాయికుడిలా ఉన్నావే! మంచు మనోజ్ రెండో పెళ్లిపై నవదీప్ కామెంట్స్.. మంచు లక్ష్మి ఎంటరై!!

టెక్నాలజీ అందుబాటులోకి రావడం, చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరడంతో ఆన్ లైన్ పరిధి బాగా విస్తరించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అందరికీ చేరువయ్యాయి. ఈ క్రమంలో రూమర్స్ తాకిడి మరింత పెరిగింది. ఇదిగో పులి అని ఒకరంటే అదిగో తోక అని అనేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందులో భాగంగానే విషయమై పలు రూమర్స్ షికారు చేశాయి. ఓ ఫారెన్‌ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇవి గమనించిన మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ ఫన్నీ కామెంట్ చేశాడు. ''ఆ పెళ్లికి దయచేసి నన్ను కూడా ఆహ్వానించండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ? ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు? మీ ఇష్టం రా.. అంతా మీ ఇష్టం'' అంటూ గాసిప్ రాయుళ్ళపై సెటైర్ వేసేశాడు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. అయితే మంచు మనోజ్ చేసిన ఈ ట్వీట్ చూసి మరో టాలీవుడ్ యంగ్ హీరో రియాక్ట్ అయ్యాడు. 'ఆహా! లేకపోతే నీ ఇష్టం అనుకున్నావా ఏంటి.. మరీ అమాయకుడిలా ఉన్నావే' అంటూ కామెంట్ వదిలాడు. ఇంతవరకు ఓ ఎత్తయితే ఇందులో కూడా దూరడం మరో ఎత్తయింది. జస్ట్ నవ్వు తట్టులేకపోతున్నా అని తెలిసేలా ఓ ఎమోజీ పోస్ట్ చేసింది మంచు వారమ్మాయి. దీంతో మంచు మనోజ్ ట్వీట్, నవదీప్- మంచు లక్ష్మి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2015లో హైదరాబాద్‌కు చెందిన ప్రణతీ రెడ్డితో మనోజ్‌ ఏడడుగులు నడిచాడు. అయితే కొన్నేళ్ళకు వాళ్ళ మధ్య మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో 2019లో వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. ఇక అప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లిపై సోషల్ మీడియా కోడై కూస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EhkgEX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...