Thursday, 7 October 2021

ఏడేళ్లుగా రాసుకున్న కథ.. కాజోల్‌తో సీనియర్ నటి రేవతి

సీనియర్ నటి దర్శకురాలిగా ఎంత మంచి పేరు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. నటన, దర్శకత్వంలో రేవతికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మధ్యే నవరస అంటూ వెబ్ సిరీస్‌లో అదరగొట్టేసింది. కరుణ రసం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన పార్ట్‌లో రేవతి నటించింది. అయితే తాజాగా రేవతి తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. అది కూడా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌తో సినిమా చేయబోతోన్నట్టు తాజాగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలు వైరల్ అవుతోన్నాయి. మిత్ర, మై ఫ్రెండ్ సినిమాతో రేవతి దర్శకురాలిగా మారింది. ఆ తరువాత ఫిర్ మిలేంగె, కేరళ కేఫ్, ముంబై కటింగ్ అనే చిత్రాలను తెరకెక్కించింది. ఇప్పుడు చాలా కాలం తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టనుంది. దాదాపు ఏడేళ్లుగా రాసిన ఈ కథలో నటించనుందని రేవతి తెలిపింది. కథ విన్న వెంటనే ఓకే చెప్పేశానంటూ కాజోల్ కూడా తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాజోల్ హీరోయిన్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నానని ప్రకటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఏడేళ్ల కంటే ఎక్కువగా ఆ పాత్ర నాతో ప్రయాణిస్తోంది.. ఇప్పుడు ఆ కారెక్టర్‌లో కాజోల్ చూపించేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నాను అని రేవతి తెలిపింది. నా తదుపరి చిత్రం రేవతి గారితో చేయబోతోన్నాను.. కథ విన్న వెంటనే ఓకే చెప్పేశాను.. ఇప్పీ అని ఎవరైనా పిలుస్తారా? అని కాజోల్ పోస్ట్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ahPMWo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...