Thursday, 21 October 2021

బాలయ్య అభిమానులకు నిరాశ తప్పదా? మరింత ఆలస్యం చేస్తున్న నందమూరి నటసింహం!!

బాలయ్య అభిమానుల ఎదురుచూపులకు ఈ సారి కూడా మోక్షం లేదని తెలుస్తోంది. చాలాకాలంగా బాలకృష్ణ- బోయపాటి సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న '' సినిమా కోసం నందమూరి లోకం వెయిట్ చేస్తోంది. ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4వ తేదీన రిలీజ్ చేయబోతున్నారనే టాక్ బయటకు రావడంతో బాలయ్య ఫ్యాన్స్ హుషారెత్తిపోయారు. కానీ అందులో నిజం లేదని ప్రస్తుతం వినిపిస్తున్న మాట. సినిమాకు సంబంధించి ఇంకా కొన్ని పనులు మిగిలి ఉండటంతో దీపావళికి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమే అని తెలుస్తోంది. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు గానీ అవుట్‌పుట్ విషయంలో వెనక్కి తగ్గొద్దని చెప్పారట బోయపాటి. సో.. నవంబర్ 4వ తేదీ వరకు అన్ని పనులు పూర్తయ్యే అవకాశం లేదట. దీంతో ఈ సినిమా డిసెంబర్ ఎండింగ్‌లో విడుదలయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. గతంలో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించిన - బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో 'అఖండ'పై బోలెడన్ని అంచనాలు నెలకొన్నాయి. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. మరో హీరోయిన్ పూర్ణ కీలకపాత్ర పోషించింది. తమన్ బాణీలు కట్టారు. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ అప్పియరెన్స్ చాలా స్పెషల్ కానుందట. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుండటం, గతంలో ఏ సినిమాలోనూ చూడనివిధంగా బాలయ్య బాబు గర్జిస్తారనే టాక్ రావడం, ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడం.. ఇవన్నీ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lWV00h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...