Wednesday, 27 October 2021

మీ అమ్మ.. అక్క..పెళ్లానికి ఇవే తంబ్ నెయిల్స్ పెడతారా? సమంత ఇష్యూపై ఆర్పీ పట్నాయక్ ఘాటు వ్యాఖ్యలు

నాగ చైతన్య‌తో విడాకుల ఇష్యూలో ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమెపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడంతో కోర్టుని ఆశ్రయించింది సమంత. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం కూకట్ పల్లి న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సమంత వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రసారం చేయడానికి వీల్లేది చెప్తూ.. అభ్యంతరక వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశించింది కోర్టు. అదే సందర్భంలో సమంతకు సైతం న్యాయస్థానం కీలక సూచన చేసింది. తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలని చెప్పింది. ఈ మేరకు ఇంజెక్షన్ ఆర్డర్‌ పాస్ చేసింది కోర్టు. కాగా ఈ పరిణామాల నేపథ్యంలో యూట్యూబ్ ఛానల్స్ ఆగడాలకు కత్తెరపడిందనే చెప్పాలి. ఇష్టం వచ్చినట్టుగా తంబ్ నెయిల్స్ పెట్టి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీనియర్ సంగీత దర్శకుడు . ‘తంబ్ నెయిల్స్ పెట్టేవాళ్లకి జబ్బు ఏంటో.. వాళ్లికి ఈ మానసిక రోగం ఏంటో కానీ.. మనం పెట్టే తంబ్ నెయిల్ వల్ల అవతల వాళ్ల క్యారెక్టర్ ఏమైపోయినా పర్లేదు.. జనం మన వీడియో చూస్తే చాలని తంబ్ నెయిల్ పెడతారు. చాలా తంబ్ నెయిల్ సెలబ్రిటీ వ్యక్తిత్వానికి సంబంధించిన పెద్ద ఇష్యూపై చాలా నెగిటివ్‌గా ఉంటుంది. తీరా లోపలికి వెళ్లి చూస్తే ఆ మ్యాటర్ ఏమీ ఉండదు. మరీ ఇంత దారుణంగా ఉంటారా? ఇంత స్వార్ధంతో ఉంటారా? వీళ్లు పెట్టే తంబ్ నెయిల్ వల్ల వాళ్ల జీవితం ఏమైపోయినా పర్లేదా? వాళ్ల బతుకులు చితికిపోయినా.. జనం ఏం అనుకున్నా పర్లేదు.. మనకి ఒక క్లిక్ వస్తే చాలు అనుకునేవారికి నేను ఒకే ఒక్క ప్రశ్న వేస్తున్నాను. ఈ సోకాల్డ్.. ప్రెస్టేజియస్ బురదలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్‌ని నేను ఒక్కటే అడుగుతున్నా. ‘మీ అమ్మని కానీ.. అక్కని కానీ.. మీ పెళ్లాన్ని కానీ ఉద్దేశించి అదే తంబ్ నెయిల్ పెట్టగలరా? ’ అంటూ ఫైర్ అయ్యారు ఆర్పీ పట్నాయక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CkxDUh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...