Wednesday, 27 October 2021

ఇక స్వేచ్చగా ఆ పని చేసుకో.. సమంతపై వెంకటేష్ కూతురి కామెంట్స్

ప్రస్తుతం దుబాయ్‌లో ఉంది. తన ఫ్రెండ్స్ సాధన, ప్రీతమ్‌లతో కలిసి సమంత దుబాయ్‌కి చెక్కేసింది. భారత్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లినట్టు కనిపిస్తోంది. మొత్తానికి సమంత మాత్రం ఎక్కడా కూడా ఒక చోట నిలకడగా ఉండకుండా తిరుగుతూనే ఉంది. అయితే సమంత తాజాగా పెయింటింగ్ గురించి చెబుతూ ఓ పోస్ట్ చేసింది. అందులోనూ ఓ సూక్తిని చెప్పేసింది. ఒకప్పుడు అలా ఉండేది అంటూ కొన్ని విషయాలు చెప్పింది. మీ మనసు మీదో పెయింటింగ్ వేయలేదు అని చెబితే.. అప్పుడే మనం పెయింట్ వేయాలి.. అలా వెంటనే లోపల అనుకున్న మాటలు ఆగిపోతాయి అని చెప్పేసింది. తాజాగా తాను పెయింటింగ్ వేశాను అని సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికి సమంత వేసిన పెయింటింగ్ మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. కరోనా వల్ల ప్రభావితం చెందిన వారి జీవితాల్లో ఆశలను రేకెత్తించేందుకు ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నామని సమంత తెలిపింది. దీనిపై సెలెబ్రిటీలంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. అందులో భాగంగా వెంకటేష్ కూతురు రియాక్ట్ అయింది. ఇక ఫ్రీగా పెయింటింగ్ వేసుకో అని కామెంట్ చేసింది. ఇంత సరదాగా ఉన్నందుకు హ్యాపీగా ఉందని మంచు లక్ష్మీ, ఈ మహారాణిని ఎవ్వరూ ఆపలేరు అంటూ మాళవికా నాయర్ కామెంట్ చేసింది. అలా వారు చేసిన కామెంట్లకు సమంత కూడా రిప్లై ఇచ్చింది. రేపు చేస్తాను అంటూ డాక్టర్ మంజుల అనగాని కూడా కామెంట్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XPAGER
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...