Saturday, 2 October 2021

విల‌న్‌గా చేయ‌డానికి నేచుర‌ల్ స్టార్ నాని ఒప్పుకుంటాడా.. అగ్ర నిర్మాత భారీ ఆఫ‌ర్‌?

నేటి త‌రం హీరోల్లో నేచుర‌ల్ స్టార్ నాని వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఏడాది ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంతో డైరెక్ట్ ఓటీటీల‌తో ప్రేక్ష‌కాభిమానుల‌ను ప‌ల‌క‌రించాడు. మ‌రోవైపు శ్యామ్ సింగ‌రాయ్ సినిమాను విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నాడు. మ‌రోవైపు వివేక్ ఆత్రేయ‌తో అంటే సుంద‌రానికీ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అలాగే వీటితో ఓ డెబ్యూ డైరెక్ట‌ర్‌తోనూ ప‌నిచేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇవ‌న్నీ ఒక‌వైపు వ‌స్తున్న వార్త‌లు కాగా.. మ‌రోవైపు త్వ‌ర‌లోనే నాని పూర్తిస్తాయి విల‌న్‌గా వెండితెర‌పై ప్రేక్షుల‌ను ఆక‌ట్టుకోబోతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. అది కూడా మ‌న తెలుగు హీరోల సినిమాలో కాదు. ఇత‌ర భాష‌కు చెందిన అగ్ర హృరో. ఇంత‌కీ ఏ సినిమాలో అనుకుంటున్నారా? కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక‌రైన ద‌ళ‌ప‌తి విజ‌య్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను దిల్‌రాజు నిర్మించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో విల‌న్‌గా క్యారెక్ట‌ర్ చాలా డిఫ‌రెంట్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా హీరో విజ‌య్‌కు పోటాపోటీగా ఉంటుంద‌ట‌. ఆ పాత్ర‌లో నేచుర‌ల్ స్టార్ నానిని న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశాడట. మరి దిల్‌రాజుతో ఉన్న రిలేష‌న్ కార‌ణంగా విజ‌య్‌ను ఢీ కొట్ట‌డానికి నాని ఒప్పుకుంటాడేమో చూడాలి. హీరోగా బిజీగా వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెడుతున్న నాని, మ‌రో వైపు నిర్మాత‌గానూ డిఫ‌రెంట్ సినిమాల‌ను నిర్మిస్తున్నాడు. నాని త‌న సోద‌రి దీప్తి గంటా ద‌ర్శ‌క‌త్వంలో మీట్ క్యూట్ అనే సినిమాను నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల‌కు సంబంధించి ఓ క్లారిటీ రానుంది. మ‌రి త‌న ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాను నాని థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తాడో లేక ఓటీటీలోనే విడుద‌ల చేస్తాడో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3B2TBdD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...