Thursday, 21 October 2021

మహేష్ బాబు కోసం ఆమెను ఫైనల్ చేసిన త్రివిక్రమ్! క్రేజీ ప్లాన్‌ వేసిన మాటల మాంత్రికుడు

సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. తన తదుపరి సినిమాను మాటల మాంత్రికుడు శ్రీనివాస్‌తో చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ప్రకటించినప్పుటి నుంచి దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ హీరోయిన్ విషయమై ఓ విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌‌గా మోడల్‌, మిస్‌ ఇండియా మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. చిత్రంలో ఓ హీరోయిన్ క్యారెక్టర్‌ బలంగా ఉంటుందని, ఇందుకోసం త్రివిక్రమ్ పక్కాగా ప్లాన్ చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అంటున్నారు. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఇప్పటికే మాస్‌ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటించే చాన్స్‌ పట్టేసింది. ఈ చిత్రంలో మహేష్ బాబు ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తాడని, తన తండ్రి ఓ డాన్ అని తెలుసుకున్న హీరో, కొన్ని పరిస్థితుల్లో తండ్రితోనే పోరాటం చేయడం జరుగుతుందనే టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆ డాన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. SMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m3h7Cj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...