Monday, 4 October 2021

ప్రమోషన్స్‌లో వేగం పెంచిన ‘కొండపొలం’ టీమ్.. సినిమా నుంచి మరో అప్‌డేట్ ఎప్పుడంటే..

సన్నపురెడ్డి వెంకట్‌రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా , సింగ్‌లు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘కొండపొలం’. విలక్షణ దర్శకుడకు రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అడవిలో పెరిగి.. ఉన్నత చదువులు చదువుకున్నా కానీ.. పట్నంలో సరైన ఉద్యోగం లభించక అవమానాలు ఎదురుకున్న వ్యక్తి పాత్రలో నటుడు వైష్ణవ్ మనకు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు మరింతగా పెంచాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో తొలుత సాఫ్ట్‌లుక్‌లో కనిపించిన వైష్ణవ్.. ఆ తర్వాత గొర్రెల కాపరి గెటప్‌లో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించారు. ఇక గొర్రెలు కాసుకొనే అమ్మాయి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా అద్భుతంగా నటించారు. మొత్తానికి ఈ ట్రైలర్‌లోనే క్రిష్ తనదైన ముద్రను చూపించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన ‘ఓబులమ్మ’, ‘శ్వాస’ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. రీసెంట్‌గానే ఈ సినిమా నుంచి ‘దారులు దారులు’ అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ కూడా వచ్చింది. సినిమా నుంచి ‘తల ఎత్తు’ అంటూ సాగే ఓ పాటని మంగళవారం(అక్టోబర్ 5న) రాత్రి 7 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. ఇందులో వైష్ణవ్ చేతిలో ఆయుధంతో మంచి సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంగీతం అందిస్తుడగా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబులు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్‌కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a9a1oU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...