Friday, 8 October 2021

మరో నవల ఆధారంగా క్రిష్ కొత్త ప్రాజెక్ట్.. మరింత ఆసక్తికర సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు

సినిమాలు తీయడంలో ఒక్కో దర్శకుడిది.. ఒక్కో స్టైల్‌ ఉంటుంది. అలా మంచి కమర్షియల్ విలువలతో పాటు.. ఓ అద్భుతమైన సందేశంతో సినిమాలు తీయడంలో డైరెక్టర్ ఎప్పుడు ముందుంటారు. ‘గమ్యం’ సినిమాతో తన దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించిన క్రిష్.. ఆ తర్వాత ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘కంచె’ వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బాలకృష్ణతో చేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాతో ఆయన రేంజ్ మరో లెవల్‌కి వెళ్లిపోయింది. అయితే రీసెంట్‌గా స‌న్న‌పురెడ్డి వెంటకరామిరెడ్డి రచించిన న‌వ‌ల ఆధారంగా క్రిష్ జాగ‌ర్ల‌మూడి ‘కొండ‌పొలం’ సినిమాను తెర‌కెక్కించారు. శుక్రవారం విడుదల అయిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. , రకుల్ ప్రీత్ సింగ్‌లో హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి నిర్మించారు. ఈ సినిమాలో ఇంజనీరింగ్ చదువుకొని.. ఉద్యోగం సంపాదించుకోలేక ఇబ్బందులు పడుతున్న ఓ యువకుడిగా వైష్ణవ్ కనిపించారు. అలాంటి యువకుడు కొండ‌పొలంకు వెళ్లిన‌ప్పుడు మాన‌సికంగా ఎలాంటి ప‌రిణితి చెందాడ‌నేదే ఈ క‌థ‌. ఇక దాదాపు అడవి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం క్రిష్ పవన్‌కళ్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్నారు. పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎవరికి తెలియని ‘వీరమల్లు’ అనే యోధుడి జీవితగాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ మరో వెబ్‌సిరీస్‌ని కూడా రూపొందిస్తున్నారట. అయితే ఇది కూడా ఓ నవల ఆధారంగా రూపొందుతుందని టాక్. ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ రూపొందిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌ను మల్లాది వెంకటకృష్ణ మూర్తి రాసిన ‘’ అనే నవల ఆధారంగా క్రిష్ తెరకెక్కిస్తున్నారని టాక్. ఇక ఇందులో తారగణం, ఇతర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oITdh3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...