Monday, 25 October 2021

ఊపులో ఉన్న నితిన్ హీరోయిన్.. మామా ఏక్ పెగ్‌లా అన్నట్టుగా లేపేసింది!

సినిమాల ద్వారా కాకుండా వివాదాలతోనే ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. ఆ మధ్య బెంగాలి నటీ మిష్టి చనిపోతే.. మిష్టి చక్రవర్తి చనిపోయిందని వార్తలు రాసేశారు. దాంతో మీడియాతో మిష్టి చక్రవర్తి సెటైర్లు వేసింది. బతికి ఉన్నవాళ్లను కూడా ఇలా చంపేస్తుంటారు.. నేను ఇంకా బతికే ఉన్నాను అంటూ మిష్టి వేసిన పోస్ట్ అప్పట్లో వైరల్ అయింది. అయితే మిష్టికి కావాల్సినంత అందమున్నా కూడా అదృష్టం మాత్రం లేనట్టు కనిపిస్తుంది. యాడ్స్ రంగం నుంచి సినిమాల్లోకి మిష్టి ఎంట్రీ ఇచ్చింది. విక్కో టర్మరిక్ అంటూ ఫేస్ క్రీమ్ ద్వారా మిష్టి ఫేమస్ అయింది. ఆ తరువాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అలా అక్కడి నుంచి తెలుగులోకి వచ్చింది. నితిన్ హీరోగా వచ్చిన చిన్నదాన నీకోసం అనే సినిమాతో డెబ్యూగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో మిష్టి అందాలకు అందరూ ఫిదా అయ్యారు. కానీ సినిమా బెడిసి కొట్టడంతో మిష్టికి అంతగా అవకాశాలు రాలేదు. వచ్చిన అవకాశాలను కూడా ఆమె సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. చేసిన ప్రతీ సినిమా అడ్రస్ లేకుండా గల్లంతైంది. సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన కోలంబస్ సినిమా గురించి ప్రేక్షకులకు అస్సలే తెలియదు. అలాంటి చిత్రంలో నటించడంతో మిష్టికి ఎటువంటి ఉపయోగం రాలేదు. ఇక ఆది హీరోగా వచ్చిన బుర్ర కథ కూడా దారుణమైన డిజాస్టర్‌గా మారింది. అలా మిష్టికి వెండితెర అంతగా కలిసి రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ హాట్ హాట్ ఫోజులతో ఆకట్టుకుంటుంది. తాజాగా బాలయ్య స్టైల్లో మామా ఏక్ పెగ్ లా అన్నట్టు.. అమాంతం ఒకే దెబ్బకు పెగ్గును లేపేసింది. ఈ వీడియోను ఫేస్ బుక్‌ స్టోరీలో షేర్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/310rJKf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...