Monday, 4 October 2021

చైతన్యతో సమంత విడాకులు.. తొలిసారిగా స్పందించిన సమంత తండ్రి

‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న హీరోహీరోయిన్లు , సమంత. ఆ తర్వాత ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాల్లో వీరు జంటగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. తొలి సినిమాతోనే ప్రేమలో పడిన వీరి.. 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి టాలీవుడ్‌లో లవ్లీ కపుల్‌గా వీరిద్దరు నిలిచిపోయారు. పెళ్లి తర్వాత కూడా నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో చై ఓ ప్రత్యేక పాత్రలో కనిపించగా.. 2019లో వీరిద్దరు కలిసి ‘మజిలీ’ అనే సినిమాలో భార్య భర్తలుగా నటించారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. అనుకోకుండా చై-సామ్‌లు విడుపోతున్నారు అంటూ గత నెలన్నర రోజులుగా వార్తలు సోషల్‌మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. దీంతో ఆ వార్తలు అన్ని రూమర్లుగానే అంతా భావించారు. కానీ, కొన్ని రోజుల క్రితం ఈ వార్తలు అన్ని చెక్ పెడుతూ.. నాగ చైతన్య, సమంతలు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే విడిపోతున్నామని.. అంతేకానీ, ఇతర కారణాలు ఏమీ లేవని వాళ్లు పేర్కొన్నారు. దయచేసి వాళ్ల ప్రైవసీకి భంగం కలిగించవద్దని వాళ్లు స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని సంస్థలు పాజిటివ్‌గా వార్తలు రాస్తుంటే.. మరికొన్ని సంస్థలు మాత్రం సామ్ ఇలాంటి పాత్రలు చేయడం వల్లే చై ఆమెతో విడాకులు తీసుకున్నాడని.. అంటూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు వార్తలు రాసుకుంటూపోయారు. అయితే తాజాగా మరియు తొలిసారిగా సమంత, నాగ చైతన్య విడాకులపై జోసెఫ్ స్పందించారు. ప్రస్తుతానికి తన మెదడు శూన్యంగా ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు. త్వరలోనే అన్ని పరిస్థితులు మామూలుగా మారిపోతాయి అని.. ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు కూడా మద్దతు ఇస్తూ.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oxFXfg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...