సమంత, విడాకుల విషయం రోజురోజుకూ ఇంకా హాట్ టాపిక్ అవుతోంది. విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించక ముందు ఏమో రూమర్లు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. విడిపోనున్నారంటూ రకరకాల కథనాలు వచ్చాయి. తామిద్దరం భార్యాభర్తలుగా విడిపోయామంటూ అక్టోబర్ 2న నాగ చైతన్య, సమంతలు ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. ఇక అప్పటి నుంచి చైతన్య, సమంతల మధ్య ఏం జరిగి ఉంటుంది? ఎందుకు విడాకులు తీసుకుని ఉంటారు? అనే వాటిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే వీటిపై నానా రకాల కథనాలు వచ్చాయి. సమంతకు అక్రమ సంబంధాలను అంటగట్టేశారు. సోదర భావంతో ఉండే ప్రీతమ్‌తో సమంతకు రిలేషన్‌ను అంటగడుతూ కథనాలు పుట్టించారు. సినీ కెరీర్ కోసం పిల్లల్ని వద్దంటోందని,అందుకే ఇలా విడాకుల వరకు వ్యవహారం వెళ్లిందని రూమర్లు వచ్చాయి. అయితే తాజాగా అన్నింటిపై క్లారిటీ ఇచ్చింది. నాకు అఫైర్లు ఉన్నాయని అన్నారు.. పిల్లల్ని వద్దని అన్నట్టు రాశారు.. అవకాశవాదిని ఆస్తి కోసం పెళ్లి చేసుకుందని అన్నారు.. అబార్షన్ చేయించుకున్నాని అన్నారు..విడాకులు అనేది ఎంతో బాధగా ఉంటుంది. ఇలా నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు.. కానీ ఇవేవీ కూడా నన్ను ముక్కలు చేయలేవు. వెనక్కి నెట్టలేవు అని సమంత ఎమోషనల్ అయింది. అయితే నాగ చైతన్య మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సమంత విడాకుల విషయాన్ని పక్కన పెట్టేసి తన షూటింగ్‌లతో బిజీగా మారిపోయాడు. దర్శకత్వంలో రాబోతోన్న థాంక్యూ మూవీ సెట్‌లో అడుపెట్టేశాడు. రాశీ ఖన్నాతో రొమాంటిక్ సీన్లతో బిజీగా ఉన్నాడు. కౌగిలిలో చై బంధీగా మారిపోయాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Ao4RjG
v
No comments:
Post a Comment