Monday, 6 September 2021

YS Jagan: సీఎం జగన్‌తో మంచు మనోజ్‌ మీట్.. ముఖ్యమంత్రిపై హీరో కామెంట్స్ వైరల్

టాలీవుడ్ హీరో, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని సోమవారం రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన మంచు మనోజ్.. జగన్‌తో కలిసి దిగిన ఫొటో షేర్ చేస్తూ ఆయన్ను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విజనరీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపిన మంచు మనోజ్.. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు, దూరదృష్టి తనను ఎంతో ఆకర్షించాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన చేయబోతున్న పనుల గురించి తెలుసుకున్నానని పేర్కొన్నారు. దేవుడి కృప జగన్‌‌పై ఉండాలని, ఆయన ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు మంచు మనోజ్. మీ పరిపాలనకు శుభాకాంక్షలు అని ఈ సందర్భంగా మనోజ్ తెలిపారు. మరికొద్ది రోజుల్లో 'అహం బ్రహ్మాస్మి' అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మంచు మనోజ్. విద్య నిర్వాణ మంచు ఆనంద్‌ సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. , ఆయన తల్లి నిర్మల దేవి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు టాక్ నడిచింది. దీంతో ఇలాంటి రూమర్స్‌కి చెక్ పెడుతూ తాను వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తానని కన్ఫర్మ్ చేశారు మనోజ్. ఈ నేపథ్యంలో ఉన్నపళంగా వెళ్లి ఆయన సీఎం జగన్‌ని కలవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మా ఎన్నికల విషయమై కలిశారా? లేక జగన్ కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా కలిశారా? లేదంటే ఏదైనా వ్యక్తిగత విషయంపై చర్చించారా? అనే సందేశాలు జనాల్లో నెలకొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kXpvBz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...