Thursday, 2 September 2021

Sidharth Shukla Death: సోషల్ మీడియాకు దూరంగా.. చివరి పోస్ట్‌లు ఇవే!

బిగ్ బాస్ విజేతగా నిలిచిన సిద్దార్థ్ శుక్లాను మాత్రం దేవుడు ఓడించాడు. సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న (40) గుండెపోటుతో గురువారం మరణించారు. రాత్రి టాబెట్లు వేసుకున్నాడని, ఉదయాన్నే గుండెపోటు రావడంతో మరణించారనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కూపర్ హాస్పిటల్ యాజమాన్యం కూడా గుండెపోటు వల్లే మరణించారని చెబుతున్నారు. ఇక సిద్దార్థ్ శుక్లా మరణంతో బాలీవుడ్ బుల్లితెర, వెండితెర తారలంతా కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఇష్టమైన ఫేవరేట్ కంటెస్టెంట్ మరణించడంతో సల్మాన్ ఖాన్ సైతం కన్నీరపెట్టేసుకున్నారు. ఇక సిద్దార్థ్ శుక్లా మరణ వార్త తెలిసి సెలెబ్రిటీలంతా షాక్ అవుతున్నారు. అమీషా పటేల్, అనితా, మౌనీరాయ్, మనీష్ మల్హోత్ర, అలీ రెజా, నేహా కక్కర్, దివ్యాంక త్రిపాఠి, జరీన్ ఖాన్, జాక్వెలిన్, పాయల్ రాజ్‌పుత్, తమన్నా, పరిణితీ చోప్రా, విక్కీ కౌశల్, సిద్దార్థ్ మల్హోత్ర వంటి వారంతా కూడా పోస్ట్‌లు చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్,ఇన్ స్టాగ్రాంలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సిద్దార్థ్ శుక్లా చివరి పోస్ట్‌లు అందరినీ టచ్ చేస్తున్నాయి. ఇన్ స్టాగ్రాంలో చివరి పోస్ట్ ఆగస్ట్ 24న ఉంది. అది కూడా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ మీద పోస్ట్ వేశారు. వారి సేవలను కొనియాడారు. ఇన్ స్టాలో 3.7 మిలియిన్ల ఫాలోవర్లు సిద్దార్థ్‌కు ఉన్నారు. ఇక ట్విట్టర్‌లో అయితే పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అవని మీద ట్వీట్ వేశారు. ఆగస్ట్ 30న వేసిన ట్వీట్ చివరిదిగా మిగిలింది. ట్విట్టర్‌లో వన్ మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. అయితే ఫేస్ బుక్‌లో మాత్రం సిద్దార్థ్ శుక్లా చాలా కాలం నుంచి పోస్ట్ చేయకుండానే ఉన్నారు. ఫేస్ బుక్‌లో సిద్దార్థ్ చివరగా జూలై 1న పోస్ట్ చేశారు. అది కూడా తన ఫోటో షూట్‌కు సంబంధించినదే. ఫేస్ బుక్‌లో సిద్దార్థ్‌కు 1.2 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gYcmXJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...