Sunday, 26 September 2021

RR Venkat: టాలీవుడ్ నిర్మాత RR వెంకట్ క‌న్నుమూత‌

ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ అధినేత‌, నిర్మాత వెంక‌ట్(54) అనారోగ్యంతో హైద‌రాబాద్‌లో క‌న్నుమూశారు. కొన్ని రోజుల నుంచి ఆయ‌న కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. చికిత్స కోసం హైద‌రాబాద్‌లోని ఏఐజీ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో వెంక‌ట్ చ‌నిపోయారు. ఈయన ఇత‌రుల‌తో క‌లిసి నిర్మాత‌గా సినిమాలు చేశారు. ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై 14 సినిమాలను నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్‌ల్లో సినిమాలు చేశారు. పైసా, ఆటోన‌గ‌ర్ సూర్య, డాన్ శీను, కిక్, బిజినెస్‌మేన్, మిరపకాయ్ ఢ‌మ‌రుకం, ల‌వ్‌లీ, పూల రంగ‌డు వంటి విజయవంతమైన సినిమాల‌ను త‌న ఆర్ఆర్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలో ఏక్ హ‌సీనా థీ, జేమ్స్.. ఇంగ్లీష్‌లో డివోర్స్ ఇన్విటేష‌న్ చిత్రాల‌ను నిర్మించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CJ8ZMK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...