Sunday, 26 September 2021

Akshay Kumar - Prabhas: అక్షయ్ కుమార్‌ను ఢీ కొట్ట‌బోతున్న ప్ర‌భాస్‌

బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌కు, బాలీవుడ్‌లో వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల హీరోగా పేరున్న అక్ష‌య్ కుమార్ పోటీ ప‌డ‌బోతున్నారా? అంటే అవున‌నే సమాధానం వినిపిస్తోంది. ఇంత‌కీ వీరిద్ద‌రూ ఏ విష‌యంలో పోటీప‌డ‌బోతున్నారో తెలుసా? బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌. సాధార‌ణంగా ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే మ‌రో స్టార్ హీరో ఓ వారం రోజుల పాటు వెన‌క్కి వెళ‌తాడు. పండ‌రోజుల్లో అయితే క‌నీసం ఓ రోజైనా వెన‌క్కి వెనుక‌ముందుగా వ‌స్తారు. కానీ ఈసారి ప్ర‌భాస్‌, అక్ష‌య్ కుమార్ బాక్సాఫీస్ వ‌ద్ద ఒకేరోజున పోటీ ప‌డ‌బోతున్నారు. వివ‌రాల్లోకెళ్తే..ప్ర‌భాస్ హీరోగా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ఆదిపురుష్‌. రామాయణంను ఈ ద‌ర్శ‌కుడి వెండితెర‌పై స‌రికొత్త టెక్నాల‌జీతో ఆవిష్క‌రించ‌బోతున్నాడు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఇప్పుడు అదే తేదికి అక్ష‌య్ కుమార్ త‌న ర‌క్షా బంధ‌న్ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇండిపెండెన్స్ డే వీకెంట్ కావ‌డంతో నాలుగురోజులు సెల‌వులుగా వీకెండ్ క‌లిసి రావ‌డంతో రెండు సినిమాల‌కు చెందిన నిర్మాత‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రి ఈ పోరులో ఎవ‌రు స‌క్సెస్ సాధిస్తార‌నేది తెలియాలంటే వెయిటింగ్ త‌ప్పేలా లేదు. ఆదిపురుష్ సినిమాలో రావ‌ణాసురుడిగా సైఫ్ ఆలీఖాన్‌, సీత‌గా కృతిస‌న‌న్ న‌టిస్తున్నారు. త్రీడీ టెక్నాల‌జీలో ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో హై టెక్నిక‌ల్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇక అక్ష‌య్ కుమార్, భూమి పెడ్నేక‌ర్ న‌టించిన ర‌క్షా బంధ‌న్‌ను సినిమాను ఆనంద్ ఎల్‌.రాయ్ రూపొందిస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌లో బాగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది. ఇప్పుడు స‌లార్‌, రాధేశ్యామ్ చిత్రాల‌తో పాటు ఆదిపురుష్ సినిమాను కూడా ప్ర‌భాస్ పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నాడు. ఆదిపురుష్‌కు ఈసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టి పోటీనే వ‌చ్చేలా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ocqcKy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...