Friday, 3 September 2021

Lanke : భారీ అందాల ప్రదర్శన.. నోయల్ మాజీ భార్య కొత్త అవతారం.. ఏస్తర్ పోస్ట్ వైరల్

తెలుగులో హీరోయిన్‌గా ఎన్ని చిత్రాల్లో నటించినా కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ర్యాపర్, సింగర్, నటుడు అయిన నోయల్‌తో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటి వ్యవహారాలతో ఏస్తర్ నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఇక ఈ ఇద్దరి బ్రేకప్ గురించి ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి. కానీ అధికారికంగా విడాకులు వచ్చిన తరువాతనే ఏస్తర్, నోయల్ నోరు విప్పారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ పరస్పర అంగీకారంతోనే విడిపోతోన్నామని చెప్పుకొచ్చారు. మొత్తానికి అలా నోయల్, ఏస్తర్ వివాహా బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అయితే ఆ తరువాత ఏస్తర్ తన దారిలో తాను వెళ్తూ వచ్చారు. ఆ మధ్య బోల్డ్ పాత్రలో నటించి అందరినీ షాక్‌కు గురి చేశారు.షకీలా వంటి వచ్చిన సినిమాలో ఏస్తర్ నటన, అందాల ఆరబోతకు అందరూ ఫిదా అయ్యారు. అయితే తాజాగా మరోసారి ఏస్తర్ అందరూ నోరెళ్ల బెట్టేలా చేసేశారు. తాజాగా తన కన్నడ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు. కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో ఏస్తర్‌కు మంచి గుర్తింపే ఉంది. తాజాగా తన కన్నడ మూవీ ‘’కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. రోబర్ల్ డీ నీరో ఓసారి ఇలా చెప్పాడు. డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచించకుడా.. ఒకరి జీవితంలోకి,పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడమే నటించడం అని అన్నారు. ఆ విషయం నాకు ఇప్పుడు తెలిసింది. ఈ పాత్రను పోషించడం నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. సెప్టెంబర్ 10న కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది అని ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gZ5cTe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...