Friday, 3 September 2021

నా బతుకేదో నేను బతుకుతా..! జీవితాంతం సింగిల్ గానే ఉంటా.. అషు రెడ్డి షాకింగ్ పోస్ట్

జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది . అదే ఇమేజ్‌తో బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన అషు రెడ్డి.. తన పాపులారిటీని రెట్టింపు చేసుకుంది. హౌస్‌లో ఆమె చేసిన అల్లరి పనులు, తనదైన చలాకీతనంతో మేల్ కంటిస్టెంట్స్‌ని అట్రాక్ట్ చేసిన విధానం అందరినీ అట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సింప్లిగంజ్‌తో మెయిన్‌టైన్ చేసిన రిలేషన్‌ ఆమెను నిత్యం వార్తల్లో నిలబెట్టింది. భారీ ఫేమ్ మూటగట్టుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన ఆమె తిరిగి సోషల్ మీడియాలో అదే హంగామా చేస్తోంది. ఓ వైపు అషుకి సంబంధించిన లవ్ ఎఫైర్ టాపిక్స్, రిలేషన్‌ ముచ్చట్లు చర్చల్లో నిలుస్తుండగా.. మరోవైపు అదే కోణంలో డబ్ స్మాష్ వీడియోలు చేసి రచ్చ చేస్తోంది అషు రెడ్డి. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ''ఆ వెదవ వల్లే నా జీవితం నాశనం అయింది'' అంటూ ఓ వీడియో పోస్ట్ చేసి షాకిచ్చిన అషు రెడ్డి.. తాజాగా అదే తరహాలో మరో వీడియో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ కావడమే గాక అషు రెడ్డి టాపిక్‌ని మరోసారి చర్చల్లో నిలిపింది. ''నాకెవ్వరొద్దు.. నాకెవ్వరు అవసరం లేదు.. నా నా బతుకేదో నేను బతుకుతా.. నాపాటికి నేనుంటా.. నాకు నేను తింట, పండుకుంటా.. జీవితాంతం సింగిల్ గానే ఉంటా'' అంటూ తుపాకీ చేతపట్టి ఈ వీడియోలో రచ్చ చేసింది అషు రెడ్డి. ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్స్ ఫన్నీ రియాక్షన్ ఇస్తూ ట్రోల్ చేస్తున్నారు. 'మరి RGVతో అంటూ' బోల్డ్ ఇంటర్వ్యూ ఇష్యూని తెరపైకి తెస్తున్నారు. రీసెంట్‌గా అషు రెడ్డి తొడల మీద తన ఫోకస్ పెట్టేస్తూ రామ్ గోపాల్ వర్మ వదులుతున్న ఫొటోస్, అప్‌డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమెపై వర్మ పెట్టిన కెమెరా యాంగిల్స్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అషు రెడ్డి షేర్ చేసిన తాజా వీడియోపై జనం అటాక్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yGxx6N
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...