పవర్ స్టార్ బర్త్ డే (సెప్టెంబర్ 2) అంటే ఫ్యాన్స్ ఏ రేంజ్‌లొ హంగామా చేస్తారో అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా మెగా హీరోల ట్వీట్లు, విషెస్ కోసం అభిమానులందరూ ఎదురుచూస్తుంటారు. ఏ హీరో ఎలా విష్ చేశారు.. ఏ ఫోటోను షేర్ చేశారు.. అంటూ అభిమానులు ఆశగా చూస్తుంటారు. ఇక చిరంజీవి, నాగబాబు, , అల్లు అర్జున్ వేసే ట్వీట్ల గురించి అందరూ కళ్లప్పగించి చూస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వారంతా ముందుగానే ట్వీట్లు వేశారు. పవన్ కళ్యాణ్‌కు తమ స్టైల్లో విషెస్ చెప్పేశారు. అల్లు అర్జున్ సైతం ఉదయాన్నే పోస్ట్ చేశారు. నా పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక బన్నీ వేసిన ట్వీట్‌కు మెగా అభిమానులు ఫిదా అయ్యారు. అందరికంటే ఆలస్యంగా రామ్ చరణ్ విషెస్ తెలిపారు. ఆయన ఎందుకు ఆలస్యంగా వేశారు.. ఇంకా ఎందుకు విషెస్ చెప్పడం లేదంటూ చర్చ జరిగింది. నాగబాబు సైతం ఆలస్యంగానే విషెస్ అందించారు. రక్తంలోని ఎరుపువి నువ్.. నీలో ఉన్న ఆ స్పార్క్ ఇప్పుడు నిప్పుకణాల్లా మారిపోయాయ్.. ఎంతో మందికి ఆదర్శం.. ఈ జాతికి భవిష్యత్తు నువ్వే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ అయితే సింపుల్‌గా బర్త్ డే విషెస్ చెప్పేశారు. అందులోనూ బాబాయ్ అని సంబోధించకుండా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని పిలిచేశాడు. నా గురువు, నా ఇన్సిపిరేషన్ అంటూ మొన్న రాఖీ పండుగ రోజు దిగిన ఫోటోను షేర్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WOPySU
v
No comments:
Post a Comment