Friday, 24 September 2021

అందుకే నేను అతడిని ప్రేమిస్తున్నాను!.. అసలు విషయం చెప్పిన రష్మీ గౌతమ్

అటు బుల్లితెరపై ఇటు సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతం అయితే రష్మీ వెండితెరకు దూరంగా ఉంటోంది. ఆ మధ్య రష్మీ చేసిన చిత్రాలు దారుణమైన ట్రోలింగ్‌కు గురయ్యాయి. విచ్చలవిడిగా చేసిన అందాల ఆరబోతకు రష్మీకి నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అన్నీ కూడా ఒకే రకమైన పాత్రలు చేయడంతో రష్మీని వెండితెరపై తిరస్కరించారు. ఇక అప్పటి నుంచి రష్మీ వెండితెరకు దూరంగానే ఉంటోంది. అయితే ఈ మధ్య మాత్రం రష్మీ బుల్లితెర, సోషల్ మీడియా మీదే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇక రష్మీ అయితే సోషల్ మీడియాలో చేసే సేవా కార్యక్రమాలు, మూగజీవాల మీద చూపించే ప్రేమకు అందరూ ఫిదా అవుతుంటారు. అలాంటి రష్మీ నిత్యం వీధి కుక్కల గురించి ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. వీధి కుక్కలకు ఏర్పడే సమస్యలపై స్పందిస్తుంటుంది. ఇక గత లాక్డౌన్‌లో అయితే రష్మీ.. వీధి కుక్కల ఆకలిని తీర్చేందుకు స్వయంగా రంగంలోకి దిగింది. అలాంటి రష్మీ తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో షేర్ చేసిన ఓ చక్కటి విషయం ఉంది. వర్షకాలంలో కావడంతో ఓ ఉద్యోగి.. రోడ్డు మీద గొడుగు పట్టుకుని ఎదురుచూస్తున్నాడు. అతని పక్కనే, ఆ గొడుగు కిందే ఓ వీధి కుక్క కూడా నిల్చుంది. దాన్ని తరమకుండా.. అలానే దానికి కూడా గొడుగు పట్టి వర్షంలో తడవకుండా చూసుకున్నాడు. ఇంకా ఇలాంటి వారున్నారు అంటూ రతన్ టాటా షేర్ చేసిన పోస్ట్ మీద రష్మీ స్పందించింది. అలాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి సాధారణ వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నారు.. వీధి కుక్కల కోసం కూడా ఆలోచిస్తున్నారు.. అందుకే నాకు అతనంటే ఇష్టం.. అందుకే ప్రేమిస్తాను అంటూ రష్మీ చెప్పుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AEGsHE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...