Friday, 24 September 2021

అబ్బాయిలతో కాదు.. అమ్మాయిలతో రొమాన్స్ చేయడం ఈజీ.. మల్లికా శెరావత్ షాకింగ్ స్టేట్‌మెంట్

సిల్వర్ స్క్రీన్‌పై గ్లామరస్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది . బోల్డ్ బ్యూటీగా బీటౌన్‌లో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. కొన్ని సినిమాల్లో హాఫ్ న్యూడ్‌గా కూడా కనిపించింది. ఈ క్రమంలోనే ‘నకాబ్‌’ వెబ్ సిరీస్‌ కంప్లీట్ చేసిన ఆమె, కెమెరా ముందు రొమాన్స్ గురించి మాట్లాడుతూ ఓపెన్ అయింది. సినిమాల్లో బోల్డ్‌గా ఉండటమే కాదు బయటకూడా బోల్డ్ కామెంట్స్ చేయడం మల్లిక హ్యబీ. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ నెట్టింట వైరల్‌గా మారి చర్చనీయాంశం అయింది. అబ్బాయిలతో రొమాన్స్ చేయడం కంటే అమ్మాయిలతో రొమాన్స్ చేయడమే చాలా ఈజీ అంటూ హాట్ కామెంట్ వదిలింది మల్లిక. ఆమె చేసిన ఈ కామెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు జనం. ఓ అమ్మాయి మరో అమ్మాయితో రొమాన్స్ ఏంటి? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా, మల్లిక చేసిన ఈ కామెంట్‌ వెనుక ఓ బలమైన రీజన్ అయితే ఉండే ఉంటుందని అంటున్నారు పబ్లిక్. ప్రస్తుతం మల్లికా శెరావత్ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'నకాబ్' MX ప్లేయర్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇందులో మరో బోల్డ్ హీరోయిన్ ఇషా గుప్తా కూడా నటించింది. ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ ఇంటిమేట్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. బహుశా ఆ సన్నివేశాలను ఉద్దేశించే మల్లికా ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా ఆమె చేసిన ఈ కామెంట్స్ ఒకింత ఆసక్తికరంగా మారి 'నకాబ్' వెబ్ సిరీస్‌కి బెస్ట్ ప్రమోషన్ కల్పించాయని చెప్పుకోవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EYpUx1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...