Sunday, 5 September 2021

కాబోయే భార్యతో ముక్కు అవినాష్ ముద్దులాట.. జబర్దస్త్ కమెడియన్ ఎంగేజ్‌మెంట్ వీడియో వైరల్

జబర్దస్త్ కమెడియన్, టెలివిజన్ ఆర్టిస్ట్ పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా అవినాష్ పెళ్లిపై లెక్కలేనన్ని రూమర్స్ వస్తున్న నేపథ్యంలో తన ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ షేర్ చేసి షాకిచ్చాడు అవినాష్. అనుజ అనే అమ్మాయితో తన నిశ్చితార్థం పూర్తయిందని ఆయన చెప్పాడు. మరోవైపు సెప్టెంబర్ 10 వినాయక చవితి సందర్భంగా ప్రసారం కాబోతున్న 'పండగే పండగ' ప్రోగ్రామ్‌లో ఇదే అనుజను పరిచయం చేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో ఎంగేజ్‌మెంట్ పూర్తి వీడియో షేర్ చేసి ఆ అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ వీడియోలో ముక్కు అవినాష్ కుటుంబ సభ్యులతో పాటు ఎంగేజ్‌మెంట్ వేడుక అంతా చూపించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అవినాష్ తన ప్రేయసికి ఇష్టంగా ముద్దు పెట్టుకుంటూ రొమాంటిక్ డాన్స్ చేయడం లాంటి సన్నివేశాలు చూపరులకు కన్నుల పండగ అయ్యాయి. వీడియో చూసిన పలువురు నెటిజన్స్ ముక్కు అవినాష్‌కి బెస్ట్ విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో బిగ్ బాస్ హౌస్‌లో తన పెర్ఫార్మెన్స్‌తో అట్రాక్ట్ చేసిన ముక్కు అవినాష్.. అదే షోలో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్, యాంకర్ అరియానాతో క్లోజ్ రిలేషన్ మెయిన్‌టైన్ చేయడం హాట్ టాపిక్ అయింది. అలా అలా వీళ్లిద్దరిపై పలు రూమర్స్ షికారు చేశాయి. అయితే ఇప్పుడు అవినాష్ ఎంగేజ్‌మెంట్‌ జరగడంతో అలాంటి రూమర్లకు చెక్ పడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zPoPEq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...