Sunday, 5 September 2021

రొమాంటిక్ అప్‌డేట్.. సెన్సార్ బోర్డ్ రియాక్షన్‌పై ఛార్మి క్రేజీ ఫీలింగ్స్

తన కొడుకు కెరీర్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆకాష్ తొలి సినిమా 'మెహబూబా' ఆశించిన మేర సక్సెస్ సాధించకపోవడంతో తన స్టైల్ మేకింగ్‌తో 'రొమాంటిక్' మూవీతో రంగంలోకి దించుతున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నారు. చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే పూరినే అందిస్తూ ఛార్మితో కలిసి నిర్మిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. 'రొమాంటిక్' సినిమా చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేసింది . ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కొత్త పోస్టర్ పంచుకుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీ అయిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు త్వరలోనే థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ విడుదల తేదీని మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు మేకర్స్. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. ఆకాష్ పూరీ సరసన హాట్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీక్వెన్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయని ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ చెప్పకనే చెప్పాయి. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పవర్‌ఫుల్ పర్‌ఫార్‌మెన్స్ సినిమాకు ప్లస్ కానుందని సమాచారం. గోవా లోని అందమైన లొకేషన్స్‌లో షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులకు కిక్కివ్వనున్నాయట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zPQeGp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...