Tuesday, 28 September 2021

ఏడాది కాలంగా ఎన్నో జ్ఞాపకాలు.. మొత్తానికి కంప్లీట్ చేసేశాం.. వైరల్ అవుతున్న సమంత లేటెస్ట్ పోస్ట్

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతూనే అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన .. కేవలం సినిమాల్లోనే గాక పలు రంగాల్లో సత్తా చాటుతోంది. అక్కినేని వారింట అడుగుపెట్టాక మరింత జోష్ పెంచి వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తన కలల ప్రపంచం అంటూ '' పేరుతో ఆన్‌లైన్ వస్త్ర వ్యాపారం షురూ చేసింది సమంత. గతేడాది సరిగ్గా ఈ రోజే (సెప్టెంబర్ 28) ఉదయం 9 గంటల 35 నిమిషాలకు తన 'సాకీ' కలల ప్రపంచాన్ని జనం ముందుకు తెచ్చింది. అయితే నేటితో ఈ సాకీ ప్రపంచం మొదలై ఏడాది గడవడంతో ఎంతో ఆనందపడుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది సామ్. మొత్తానికి ఓ ఏడాది కంప్లీట్ చేసేశాం ఇంకా బలంగా ముందుకెళ్తున్నాం అని పేర్కొంటూ కేక్ చేతబట్టిన ఓ చిన్న వీడియో పోస్ట్ చేయడమే గాక ''గతేడాది ప్రేమను కురిపించిన సాకీ కుటుంబానికి కృతజ్ఞతలు. ఈ అసాధారణమైన ప్రయాణానికి ధన్యవాదాలు'' అని ట్యాగ్ లైన్ రాసింది సమంత. ఇది చూసి ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇకపోతే గత కొన్ని రోజులుగా సమంత విడాకుల ఇష్యూ నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చై- సామ్ నడుమ అభిప్రాయ బేధాలు వచ్చాయని, వాళ్లిద్దరూ డివోర్స్ తీసుకునేందుకు రెడీ అయ్యారనే వార్తలు ఓ రేంజ్‌లో షికారు చేస్తున్నాయి. అయినప్పటికీ ఇటు సమంత గానీ, అటు అక్కినేని కుటుంబం గానీ ఈ వార్తలపై స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం సమంత చెన్నైలో తన స్నేహితులతో సరదాగా సమయం గడుపుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oiGcuu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...