Wednesday, 1 September 2021

ఐసీయూలో నటుడు దిలీప్ కుమార్ సతీమణి.. ఆందోళనలో కుటుంబసభ్యులు, అభిమానులు

బాలీవుడ్ లెజెండరీ నటుడు కొద్ది రోజుల క్రితమే కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ప్లూరల్ ఎఫ్యూషన్‏తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన జూలై 7వ తేదీన ఉదయం తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ మృతితో బాలీవుడ్ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటు అంటు ప్రముఖులు ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి మరోసారి ఏర్పడింది. ఆయన భార్య తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. దిలీప్ మృతితో తీవ్రస్థాయిలో మనస్థాపానికి గురైన ఆమె అప్పటి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. కాగా మూడు రోజుల క్రితం రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చెర్పించినట్లు కుటుంబ సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. దీంతో వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే భర్త మరణమే సైరా భాను అనారోగ్యానికి కారణం అని సన్నిహితులు చెబుతున్నారు. కాగా సైరా-దిలీప్లది ప్రేమ వివాహం. వారి వైవాహిక బంధంలో దిలీప్‌కు సైరా వెన్నుముకగా నిలిచారు. ఆయన ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు దగ్గరుండి ఆమె సేవలు చేశారు. ఆయన మరణం తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది అని వాళ్లు అంటున్నారు. ఇక ఆమె అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. అభిమానులతో పాటు.. పలువురు సినీ ప్రముఖులు కూడా సైరా భాను ఆరోగ్యం మెరుగుపడాలి అని కోరుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DEU1si
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...