ఏపీలో జగన్ పాలన ఎలా ఉందన్నదానిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్, జనసేన నాయకుడు . ఆయన మాట్లాడుతూ.. ‘ఇంకా రెండేళ్లు పాలన ఉంది కాబట్టి.. ఎన్నికల ముందు ఈ పాలన గురించి మాట్లాడతా.. ముందే మాట్లాడను.. దానికి వేరేవాళ్లు ఉంటారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. సీఎం కావాలనే జనసైనికుల కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ‘నన్ను ఎప్పుడూ ఓడించలేవ్.. ఎందుకంటే నేను ఫైట్ చేస్తూనే ఉంటా’ అనే కొటేషన్ పవన్ కళ్యాణ్‌కి వర్తిస్తుంది. కళ్యాణ్ బాబు ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పవన్ కళ్యాణ్ విలువ తెలియకపోవచ్చు కానీ.. మెల్ల మెల్లగా తెలుసుకుంటారు. నిజాయితీలో కానీ వ్యక్తిత్వంలో కానీ పవన్ కళ్యాణ్ పేరు పెట్టలేం. ఎటువంటి ఆశ లేనివాడు.. జన్యున్ పర్సన్ యుద్దం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడు.. సీఎం అవుతాడు. పాకిస్థానల్‌లో ఇమ్రాన్ ఖాన్ సుమారు పాతికేళ్లు పోరాడాడు. రాజశేఖర్ రెడ్డి కూడా పాతికేళ్ల పాటు పోరాడాడు. ఒక్క చంద్రబాబు గారికే రామారావుగారి వల్ల ఒక రూట్ దొరికింది కానీ.. ఆయన కూడా పోరాడాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. కళ్యాణ్ బాబు ఐదేళ్లలో అద్భుతాలు చేయొచ్చని రాజకీయాల్లోకి రాలేదు.. ఏపీకి సీఎం అయిపోవాలని కాదు.. మంచి పరిపాలన అందించాలనే రాజకీయాల్లోకి వచ్చాడు. గెలిచినా ఓడినా.. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే అనుకుంటాడు.. ఈ ఒక్క కారణం చాలు పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా సీఎం అవుతాడు’ అని అనడానికి. మంచి రాజకీయం అంటే పవన్ కళ్యాణ్‌తోనే సాధ్యం. దోచుకోవాలనేది పవన్‌కి ఉండదు. ప్రజలు నీతికి అవినీతికి మధ్య ఉన్న తేడాని త్వరలోనే తెలుసుకుంటారు. కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చు. కళ్యాణ్ బాబు లాంటి వాడే ఈ దేశానికి కావాలి.. లాంగ్ టర్మ్‌లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు.. త్వరలోనే సీఎం అవుతాడు.. గట్టిగా కొడతాడు’ అంటూ ధీమా వ్యక్తం చేశారు మెగా బ్రదర్ నాగబాబు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BAlda7
v
No comments:
Post a Comment