పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్పీడు పెంచాడు. వరుస సినిమాలను అనౌన్స్ చేయడమే కాదు. వాటిని పట్టాలెక్కించేస్తున్నాడు కూడా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం. కాగా.. లేటెస్ట్ వివరాల మేరకు ఈ సినిమాకు హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే ఓ క్రేజీ టైటిల్‌ను పెట్టాలని అనుకుంటున్నాడట. అయితే ఇదే ఫైనల్ టైటిల్ కాకపోవచ్చునని, వర్కింగ్ టైటిల్‌తోనే సినిమాను స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ఒకవేళ భగత్ సింగ్ పేరెందుకు పెట్టారని ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే భవదీయుడు అనే టైటిల్‌తో ముందుకెళ్లాలని భావిస్తున్నారట. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటే ఎవరైనా టక్కున గుర్తుకొచ్చేది గబ్బర్‌సింగ్ సినిమానే. దాదాపు పదేళ్లుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్‌కు, ఆయన అభిమానులకు గబ్బర్‌సింగ్ మూవీ ఫీస్ట్‌లా మారింది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో సినిమా అంటే సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన హరీశ్ శంకర్.. ఈ సినిమాతో పవన్‌తో మరో భారీ హిట్ కొట్టాలని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం పవన్ రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఒకటి భీమ్లానాయక్, మరోటి హరిహర వీరమల్లు. ఈ రెండు సినిమాలు సమాంతరంగా సాగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాతే పవన్ నెక్ట్స్ మూవీని ట్రాక్ ఎక్కిస్తాడనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో పవన్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తాడని, కాదు.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడంటూ ఇప్పటికే సినిమాకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రేక్షకాభిమానులే కాదు, ఇండస్ట్రీ వర్గాలు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయనడంలో సందేహం లేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zNqbjd
v
No comments:
Post a Comment