Monday, 6 September 2021

డైరెక్టర్ శంకర్ డాటర్ సినీ ఎంట్రీ.. అధికారికంగా స్వాగతం పలికిన స్టార్ హీరో.. పూర్తి వివరాలివే!

స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోహీరోయిన్ల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కామన్‌గా జరుగుతూ వస్తోంది. ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా సినీ వారసుల రంగ ప్రవేశాలు రెగ్యులర్‌గా చూస్తూ వస్తున్నాం. అయితే అలా ఎంట్రీ ఇచ్చిన స్టార్ డాటర్స్‌లో సక్సెస్ సాధించిన వారు మాత్రం తక్కువే అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ధైర్యంగా ఆత్మవిశ్వసంతో ముందడుగేసి సినీ ఆరంగేట్రం చేస్తోంది స్టార్ చిన్న కూతురు . తాజాగా స్టార్ హీరో సూర్య ఆమెకు స్వాగతం పలుకుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. తమిళ స్టార్ హీరో కార్తి నటిస్తున్న కొత్త సినిమా 'విరుమన్‌'. ఇదే సినిమాతో అదితి శంకర్ హీరోయిన్‌గా ప్రేక్షకులను పలకరించబోతోంది. డైరెక్టర్ ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అదితి శంకర్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టర్ పంచుకున్నారు సూర్య. ఇందులో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన అదితి అందరినీ అట్రాక్ట్ చేసింది. 'వెల్‌కమ్ అదితి.. ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటావు. నీపై ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటుంది' అని సూర్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు తన కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న సూర్య, కార్తీ, జ్యోతికలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్ శంకర్. ఫుల్‌ ప్రిపరేషన్‌తో వస్తున్న అదితిని అంతా ఆదరిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. సెప్టెంబర్ 18న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి 2022 ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సో.. చుడాలిమరి ఈ సినిమాతో శంకర్ కూతురు తనను తాను ఎలా ప్రూవ్ చేసుకుంటుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tm3eBo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...