Sunday, 26 September 2021

వంశీ పైడిపల్లి దళపతి విజయ్ ప్రాజెక్ట్.. అనౌన్స్ చేసిన దిల్ రాజు

ఇప్పుడు ప్యాన్ ఇండియన ప్రాజెక్ట్‌ల మీద బాగానే దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. రామ్ చరణ్ శంకర్ సినిమాతో దిల్ రాజు తన సత్తా చాటబోతోన్నాడు. అయితే అలాంటి మరో క్రేజీ కాంబోను కూడా దిల్ రాజు సెట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రూమర్లు ఇది వరకే ఎన్నో వచ్చాయి. దిల్ రాజు కాంబోలో ఓ చిత్రం రాబోతోందంటూ గత కొన్ని నెలలుగా రూమర్లు వినిపిస్తూనే వచ్చాయి. అయితే తాజాగా దిల్ రాజు తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చేశాడు. మహర్షి చిత్రం తరువాత వంశీ పైడిపల్లి సరైన కథ కోసం తిరుగుతూనే ఉన్నాడు. మహర్షి తరువాత మళ్లీ మహేష్ బాబుతో సినిమా అనుకున్నాడు. అంతా ఫిక్స్ అయింది కూడా. కానీ చివరకు ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. కానీ అదే కథతో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు సినిమా చేయబోతోన్నాడంటూ వార్తలు రాగా.. అవి ఇప్పుడు నిజమయ్యాయి. దళపతి 66వ చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ అప్డేట్‌ను అధికారికంగా చెప్పాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం.. ఇది మాకు ఎంతో గర్వంగా ఉంది. దళపతి 66 సినిమాను మేం నిర్మించడం మాకు ఎంతో ప్రతిష్టాత్మకం అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది. దిల్ రాజు, విజయ్, వంశీ పైడిపల్లి ఈ మేరకు దిగిన ఫోటో ఒకటి బయటకు వదిలారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uluAIk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...