Sunday, 26 September 2021

ఒకేసారి తొమ్మిది చిత్రాలకు డబ్బింగ్.. ఇస్మార్ట్ నిధి జోరు మామూలుగా లేదు!

ఇస్మార్ట్ హీరోయిన్ ప్రస్తుతం ఫుల్ జోరు మీదున్నట్టు కనిపిస్తోంది. ఇక ఇన్ స్టాగ్రాంలో నిధి గత నాలుగు రోజులుగా రచ్చ చేస్తోంది. అంతకు ముందు కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరింత యాక్టివ్ అవుతోంది. ప్రతీ రోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఓ సీక్రెట్ చొప్పున.. 12 సీక్రెట్లను చెబుతాను నిధి తెలిపింది. దీనిలో భాగంగా ఆమె గోళ్లు, వెంట్రుకలు, ఉదయాన్నే తాగే పానియం గురించి నిధి రహస్యాలు చెప్పేసింది. కానీ నేడు మాత్రం నిధి తన మాటను తప్పింది. పన్నెండు గంటలకు వదులుతాను అన్న సీక్రెట్‌ను మిస్ చేసింది. అయితే దానికి కూడా ఓ కారణం ఉన్నట్టు కనిపిస్తోంది. నిధి అగర్వాల్ ప్రస్తుతం చెప్పిన మాటలు వింటే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. తాను ఇప్పుడు ఒకే సారి తొమ్మిది చిత్రాలకు డబ్బింగ్ చెబుతున్నట్టు పేర్కొంది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మీకోసం ఓ ప్రత్యేకమైన అప్డేట్ రాబోతోంది అంటూ చెప్పేసింది. మొత్తానికి నిధి వ్యవహారం మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఆమె ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో రాబోతోన్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. తన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రావడంపై నిధి ఫుల్ ఖుషీ అయింది. ఇక గల్లా అశోక్ హీరో సినిమాలోనూ నిధి నటిస్తోంది. తెలుగులో నిధి ప్రస్తుతం ఈ రెండు చిత్రాలను మాత్రమే చేస్తోన్నట్టు తెలుస్తోంది. మిగతా ఏడు చిత్రాలు ఏంటా? అని అందరూ అనుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AIoMe5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...