Monday, 27 September 2021

నచ్చిన వ్యక్తులతో జోరు వానలో సమంత.. టార్గెట్ పక్కా అంటూ అక్కినేని కోడలి పోస్ట్! ఇదీ సంగతి

అక్కినేని సమంత.. గత నెలరోజులుగా ఈ స్టార్ హీరోయిన్ గురించిన వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. అందుకు ముఖ్య కారణం ఆమె విడాకుల ఇష్యూ. నాగ చైతన్యను పెళ్లాడాక ఎంతో హంగామా చేస్తూ వరుస హిట్స్ పట్టేస్తున్న సమంత.. ఇక ఆ కుటుంబంతో కట్ చేసుకోబోతోందని, నాగ చైతన్య- మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలు డివోర్స్ వరకూ వెళ్లాయని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సమంత పెడుతున్న పోస్టులు, ఆమె వేస్తున్న టూర్స్ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. రీసెంట్‌గా తన స్నేహితులతో కలిసి వేదేశాలను చుట్టి వచ్చిన సమంత.. ప్రస్తుతం చెన్నైలో ఎంజాయ్ చేస్తోంది. 'శాకుంతలం' మూవీ షూటింగ్ ఫినిష్ కావడంతో ఒంటరిగానే (చైతూ లేకుండా) ఖాళీ సమయాన్ని జాలీగా గడుపుతోంది. స్నేహితులతో కలిసి హాలీడే ట్రిప్స్ వేస్తోంది. ఈ క్రమంలోనే త్రిష, కీర్తి సురేశ్‌, కళ్యాణ్‌ ప్రియదర్శన్‌‌లతో నైట్ పార్టీ ఎంజాయ్ చేసిన సామ్.. ఇప్పుడు జోరు వానలో సైక్లింగ్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తూ ఓ టార్గెట్ పెట్టుకున్న సమంత ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. నచ్చిన వ్యక్తులతో వర్షంలో సైక్లింగ్ చేయడం ఎంతో మధురం అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చింది. అలాగే తొలిరోజు 21 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన తాను.. 100 కిలోమీటర్లు రీచ్ అవుతానని, టార్గెట్ మిస్ కాదని చెబుతూ సందేశమిచ్చింది. దీంతో ఈ పోస్ట్ చూసిన సమంత ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ugY8GX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...