Friday, 3 September 2021

తడి చీరలో.. కొంగు జార్చుకున్న అదితి.. ‘మహాసముద్రం’ నుంచి అప్‌డేట్ ఎప్పుడంటే

రొటీన్ సినిమాల్లా కాకుండా ఓ డిఫరెంట్ కథతో తెరకెక్కుతున్న సినిమా ‘’. తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తోనే తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. , హీరోలుగా ‘మహా సముద్రం’ సినిమాను రూపొందించారు. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అదితి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండనుంది అంటూ ఆమె పోస్టర్ విడుదల చేసిన రోజునే అర్థం అయింది. అయితే.. ఈ సినిమా నుంచి నటి రంభకు డెడికేట్ చేస్తూ.. ‘హే రంభ రంభ’ అనే మాస్ పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ‘చెప్పకే.. చెప్పకే’ అంటూ సాగే ఈ మెలోడీ పాటను సెప్టెంబర్ 6వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో తడి చీరలో, జారిపోయిన కొంగుతో.. అందాల విందు చేస్తూ అదితి రావు మనకు కనిపిస్తోంది. పోస్టరే ఇంత అందంగా ఉంటే ఇక పాట ఎంత బాగుంటుందో అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో జగపతిబాబు, రావు రమేష్ లాంటి సీనియర్లు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రామేష్ గూని పాత్రలో నటించడం మరో విశేషం. యువ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. తెలుగుతో పాటు తమిళంలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h0Godl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...