Wednesday, 1 September 2021

Bheemla Nayak: పవన్‌ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ‘ఆడగాదు.. ఈడగాదు’ అంటూ పాట విడుదల

మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో ఈ మధ్యే ప్రేక్షకులను పలకరించిన పవన్‌.. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్ ‘భీమ్లా నాయక్’ ఒకటి. ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక గురువారం పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు జరుగనుంది. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్‌డేట్ల సునామీ రానుంది. క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి ఓ అప్‌డేట్, ఇక హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా టైటిల్ ప్రకటన గురువారమే జరుగనుందని టాక్. ఇక అన్నిటికంటే ప్రధానంగా ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి మొదటి పాట గురువారం విడుదల కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే పవన్ పుట్టినరోజుకు ముందే అభిమానులకు రచయిత ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘భీమ్లా నాయక్’ పాట ఫస్ట్ సింగిల్‌ లిరిక్స్‌ను ఆయన ట్విట్ చేశారు. ‘సెభాష్.. ఆడాగాదు.. ఈడాగాదు’ అంటూ ఈ పాట ఆరంభం అవుతోంది. ఈ లిరిక్స్ చూస్తుంటే ఇది భీమ్లా నాయక్ ఇంట్రో సాంగ్ అని స్పష్టంగా అర్ధం అవుతోంది. పాటలో పవన్‌కళ్యాణ్ హీరోయిజం అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా లిరిక్స్ అందించారు. రామ జోగయ్యా శాస్త్రి. ఇక ఈ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WCUSJc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...