Wednesday, 1 September 2021

Bheemla Nayak: దాని గురించి అప్‌డేట్ ఇచ్చిన తమన్.. లీడర్ దారివ్వండి అంటూ ట్వీట్

మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో ఈ మధ్యే ప్రేక్షకులను పలకరించిన పవన్‌.. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్ ‘’ ఒకటి. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక గురువారం పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు జరుగనుంది. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్‌డేట్ల సునామీ రానుంది. క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి ఓ అప్‌డేట్, ఇక హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా టైటిల్ ప్రకటన గురువారమే జరుగనుందని టాక్. ఇక అన్నిటికంటే ప్రధానంగా ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి మొదటి పాట గురువారం విడుదల కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ ట్వీట్ చేశారు. పవన్ వెనక్కి తిరిగి నిలుచొని ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన ఆయన ‘భీమ్లా నాయక్‌ నుంచి ఫస్ట్ సింగిల్ వస్తోంది. రిఫిల్స్ తయారు చేసిన రైఫిల్స్.. తమన లీడర్‌కి దారి ఇవ్వండి’ అంటూ సాంగ్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఉదాహరణగా చెబుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన రచయిత రామజోగయ్య శాస్త్రిని కూడా ట్యాగ్ చేశారు. ఇక సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ‌బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను సాగర్‌ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నిత్యా మీనన్ పవన్‌ భార్య పాత్రలో నటిస్తుండగా.. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BusBDJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...