Wednesday, 1 September 2021

Bheemla Nayak ఫస్ట్ సింగిల్‌పై తమన్ మరో ట్వీట్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌కి రెట్టింపు పవర్ ఇస్తూ పోస్ట్

సెప్టెంబర్‌ 2 పవర్‌ స్టార్‌ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు రాబోతున్న సర్‌ప్రైజ్‌ల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. కొత్త సినిమా అప్‌డేట్స్ చూసి అసలైన పండుగను సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు గ్రాండ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పుట్టినరోజున రాబోతున్న '' ఫస్ట్ సింగిల్‌ గురించి తమన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే వదిలిన 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లింప్స్ పవర్ స్టార్ అభిమానులకు ఊహించని కిక్కివ్వగా రేపు రాబోయే ఫస్ట్ సింగిల్ అంతకుమించి ఉంటుంది అన్నట్లుగా హింట్ ఇచ్చారు తమన్. తన సినిమాలకి సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే మ్యూజిక్ మాంత్రికుడు భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్‌పై గతంలోనూ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజును పవర్‌‌ఫుల్‌ సాంగ్‌‌తో సెలబ్రేట్‌ చేసుకుందామని ట్వీట్ పెట్టారు. తాజాగా మరోసారి ఇదే సాంగ్‌పై ఆయన చూపిన స్పెషల్ ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులకు రెట్టింపు పవర్ ఇస్తోంది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తుండగా.. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా.. నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DCAtVy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...